రక్తదానంపై అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2022-01-22T05:03:23+05:30 IST

రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తలసేమియా, డయాలసిస్‌ బాధితులకు రెడ్‌క్రాస్‌ తరపున ఆపన్నహస్తం అందించా లని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు.

రక్తదానంపై అవగాహన కల్పించండి
రెడ్‌ క్రాస్‌లో అంబులెన్స్‌ షెడ్డును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
ఏలూరుక్రైం, జనవరి 21 : రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తలసేమియా, డయాలసిస్‌ బాధితులకు రెడ్‌క్రాస్‌ తరపున ఆపన్నహస్తం అందించా లని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రి ప్రాంగణం లోని రెడ్‌క్రాస్‌ భవనంలో జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి తండ్రి బి.వి.రంగారెడ్డి జ్ఞాపకార్థం మూడు అంబులెన్సులు పార్కింగ్‌ చేసుకునేం దుకు అనువుగా నిర్మించిన షెడ్డును కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు త్వరగా చేయాల్సిందిగా చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డికి సూచించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. చైర్మన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం త్వరలోనే దాతల సహకా రంతో డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యం లో వైద్యుల సూచన మేరకు ఇంటి వద్దే ఆక్సిజన్‌ మిషన్‌ పెట్టుకోవడానికి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అవసరమైన వారికి అందించడానికి ఏలూరు, తణుకు, నరసాపురం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పనబాక రచన, జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్‌  మోహన్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.రవి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగచంద్రారెడ్డి, జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బెన్ని, రెడ్‌క్రాస్‌ కాంపోనెంట్‌ బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, బొమ్మారెడ్డి పద్మజావాణి, గౌరవ కార్యదర్శి కృష్ణారావు, రెడ్‌క్రాస్‌ ఆడిటర్‌ గురజాడ శ్రీకాంత్‌, ట్రెజరర్‌ రేవూరి శివశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:03:23+05:30 IST