సేవా భావంతో వైద్యం చేయాలి

ABN , First Publish Date - 2021-10-23T04:22:48+05:30 IST

వైద్యులు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో వైద్యం చేయాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు.

సేవా భావంతో వైద్యం చేయాలి
డిగ్రీ పట్టాను అందుకుంటున్న వైద్యురాలు

డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ శ్యామ్‌ప్రసాద్‌  

పెదవేగి, అక్టోబరు 22 : వైద్యులు వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా భావంతో వైద్యం చేయాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ సూచించారు. దుగ్గిరాల సెయింట్‌ జోసెఫ్‌ దంతవైద్య కళాశాలలో దంతవైద్య విద్యార్థులకు గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ క్రమశిక్షణ, సేవాభావం సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల ఎదుగుదలకు కారణమంటూ కళాశాల చైర్మన్‌ బిషప్‌ జయరావు, కరస్పాండెంట్‌ ఫాదర్‌ మోజెస్‌ సేవలను కొనియాడారు. ముందుగా 2016 ఏడాది బీడీఎస్‌, 2018 ఎండీఎస్‌ విద్యార్థులకు పట్టాలను పంపిణీ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డెంటల్‌ కౌన్సిల్‌ సభ్యు లు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, ఏలూరు పీఠాధిపతి బిషప్‌ పొలిమేర జయరావు, కళాశాల కరస్పాండెంట్‌ ఫాదర్‌ జి.మోజెస్‌, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ డాక్టర్‌ పి.బాల, చాన్సలర్‌ ఫాదర్‌ బాబూ జార్జి, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.స్లీవరాజు, ఏవో ఫాదర్‌ ఫెలిక్స్‌, ఫాదర్‌ పి.జాకబ్‌, ఫాదర్‌ మైఖేల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T04:22:48+05:30 IST