Advertisement
Advertisement
Abn logo
Advertisement

దీవెన కాదు..శాపం

 తల్లుల ఖాతాలకు విద్యాదీవెన

కళాశాలలకు అందని సొమ్ము

సర్టిఫికెట్‌లు ఇవ్వని యాజమాన్యాలు

బకాయిలు చెల్లించని ప్రభుత్వం

నష్టపోతున్న విద్యార్థులు  


ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన పథకం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును కళాశాలల ఖాతాల్లోనే జమచేయాలని న్యాయస్థానం ఆదేశించినా ప్రభుత్వం తల్లుల ఖాతాలోనే జమ చేస్తోంది. ఆ సొమ్మును వారం రోజుల్లో కళాశాలలకు చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. అయినా కళాశాలలకు విద్యార్థులు సక్రమంగా ఫీజులు చెల్లించడం లేదు. దీంతో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదు. ఈ విధానం వల్ల అంతిమంగా విద్యార్థులే నష్టపోతున్నారు.


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని 16 ఇంజనీరింగ్‌ కళాశాలలు, 116 డిగ్రీ, పీజీ కళాశాలల్లో చదువు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు సర్టిఫికెట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామంటూ కళా శాలలు స్పష్టం చేస్తున్నాయి. మంచి ఉద్యోగా లు పొందిన విద్యార్థులు సొంత సొమ్ములు చెల్లిం చి సర్టిఫికెట్‌లు తీసుకువెళుతున్నారు. లేనివారం తా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎప్పుడైనా సొ మ్ములు వస్తాయనే నమ్మకం ఉన్న విద్యార్థులకు కళాశాలలే సర్టిఫికెట్‌లు ఇస్తున్నాయి. ఇంజనీరిం గ్‌లో 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి గడచిన జూన్‌లో డిగ్రీలు పూర్తి చేసుకున్నారు. సైన్స్‌, కామర్స్‌ వంటి డిగ్రీ విద్యార్థులకు సెప్టెంబ ర్‌లోనే పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ పూర్తయిన ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో 70 శాతం మంది ఉద్యో గాల్లో చేరారు. వారంతా సర్టిఫికెట్‌లు సమర్పించాలి. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయ కపోవడంతో విద్యార్థులపై కళాశాలలు పట్టు బిగించాయి.  


పీజీ విద్యార్థుల భవితవ్యం..?

గతంలో పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వర్తించేది. ప్రస్తుతం వీరికి విద్యాదీవెన నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో బకాయి పడ్డ రెండేళ్ల ఫీజును విడుదల చేయలేదు. పీజీ విద్యార్థులకు చెల్లించేది లేదని ఏడాది తర్వాత  ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా మూడేళ్ల ఫీజు పెండింగ్‌లో ఉంది. జిల్లాలో ఇంజనీరింగ్‌ పీజీ, ఎంబీఏ, ఎంసీఏ ఇతర కోర్సులకు రూ.50 కోట్లు బకాయిలున్నాయి. ప్రభుత్వం ఈ విషయ మై పెదవి విప్పడం లేదు. విద్యార్థులకు కళాశా లలు సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదు.కేవలం ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు నిర్వహించే కళాశాలలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్‌లు ఇవ్వకపోవడంతో ఉద్యోగావకాశాలకు దూరమవుతున్నారు. 


 మాట తప్పిన ప్రభుత్వం 

ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు చెల్లించనున్నట్టు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కార్యాచరణలో మాట తప్పింది. నవంబరు 30న మూడో క్వార్టర్‌ బకాయిలను జమ చేసిం ది. చివరి విడత సొమ్ములు విడుదల చేయా ల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథ కాన్ని విద్యాదీవెనగా మార్పు చేసింది. జిల్లాలో ఇంజనీరింగ్‌, డిగ్రీ కశాలలకు సంబంధించి చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నాలుగో విడతగా దాదాపు రూ.45 కోట్లు చెల్లించాలి. దీనిపై ప్రభుత్వమే స్పందించాలి. లేదంటే అంతిమంగా విద్యార్థులకే నష్టం. 

Advertisement
Advertisement