మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు : డీఐజీ

ABN , First Publish Date - 2021-07-31T05:23:34+05:30 IST

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని రేంజ్‌ పరిధిలోని సిబ్బందిని ఆదేశించినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు.

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు : డీఐజీ
వీసీలో పాల్గొన్న డీఐజీ

 ఏలూరు క్రైం, జూలై 30: మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని రేంజ్‌ పరిధిలోని సిబ్బందిని ఆదేశించినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు  చెప్పారు. జూలై 30 ప్రపంచ మానవ అక్రమ రవా ణా నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయం నుంచి సీఐడీ అడిష నల్‌ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌, లాఅండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ ఎ.రవిశంకర్‌ రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధి కారులు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధానికి చర్యలు తీసుకోవాల న్నారు. డీఐజీ మోహనరావు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా నిరోధానికి నిఘా ఏ ర్పాటు చేశామన్నారు. రేంజ్‌ పరిధిలోని తూ ర్పు, పశ్చిమ, కృష్ణాజిల్లాలు, రాజమండ్రి అర్బన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసే కార్య క్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామరు. మహిళలు, బాలికలు, ఆపద సమ యంలో 100 లేదా 112, 181, లేదా చైల్డ్‌లైన్‌ నెంబర్‌ 1098కు కాల్‌ చేసి సేవ లను వినియోగించుకోవాలని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. 

Updated Date - 2021-07-31T05:23:34+05:30 IST