అత్యవసర సేవలకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2021-05-06T05:04:48+05:30 IST

అత్యవసర సేవలకు వెళ్ళే వారిని ఇబ్బందులు పెట్టవద్దని వారికి మినహా యింపు ఉందని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు పోలీసులను ఆదేశించారు.

అత్యవసర సేవలకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టొద్దు
ఏలూరులో బిక్షాటకుడికి ఆహారం అందిస్తున్న డీఐజీ మోహనరావు

డీఐజీ మోహనరావు

ఏలూరు క్రైం, మే 5 : అత్యవసర సేవలకు వెళ్ళే వారిని ఇబ్బందులు పెట్టవద్దని వారికి మినహా యింపు ఉందని ఏలూరు రేంజ్‌ డీఐజీ కెవీ మోహనరావు పోలీసులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఏలూరు ఫైర్‌స్టేషన్‌ వద్ద ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కర్ఫ్యూ అమలును పరిశీలించారు.కర్ఫ్యూ సమయంలో ఎపీ  ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యో గులు,  కోర్టులు, పట్టణాలు, పల్లెల్లో అత్యవసర విధులు నిర్వర్తించేవారు సరైన గుర్తింపుతో ఉన్న పాస్‌లు, ఐడీ కార్డులు చూ పించి మినహాయింపు పొందవచ్చునన్నారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, ఆసుపత్రి సేవలు అందించేవారికి మిన హాయింపు ఉందన్నారు. గర్భిణులు, వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళేవారికి, వ్యాక్సినేషన్‌ కోసం వెళ్ళేవారు, వైద్యకోసం తీసుకువెళ్ళే వాహనాలు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్ల నుంచి వచ్చేవారు టిక్కెట్లు చూపించి వారికోసం ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాలను ఉపయో గించుకోవడానికి, సరుకులు రవాణా చేసే వాహ నాలకు మినహాయింపు ఉంద న్నారు.  ప్రజారవాణాకు, అంత ర్రాష్ట్ర జిల్లాల ప్రయా ణికులకు కర్ఫ్యూ సమ యంలో అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్ణయిం చిన పెళ్లిళ్లకు 20 మం దితో మాత్రమే స్థానిక అధికారుల అనుమతి తీసుకుని నిర్వహించు కోవాలన్నారు. ఫైర్‌స్టేషన్‌ వద్ద భిక్షాటన చేసుకునే ఒక వ్యక్తికి ఆహార పదార్థాలను, మంచినీటిని అందించారు.ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌, డీటీసీ డీఎస్పీ ప్రభాకరరావు, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, టూటౌన్‌ సీఐ బోణం ఆదిప్రసాద్‌, త్రిటౌన్‌ సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ ప్రసాద్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు,  ఉన్నారు. 


Updated Date - 2021-05-06T05:04:48+05:30 IST