ప్రభుత్వ జీతం...ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు

ABN , First Publish Date - 2021-06-15T05:15:23+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ప్రైవేటు ఆసుపత్రిలో ఒక వైద్యురాలు చికిత్స చేస్తున్నారు.

ప్రభుత్వ జీతం...ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు

తణుకు, జూన్‌ 14: ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన సమయంలో ప్రైవేటు ఆసుపత్రిలో ఒక వైద్యురాలు చికిత్స చేస్తున్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలోని పీపీయూనిట్‌లో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్‌ చాముండేశ్వరి చల్లా అప్పారావు రోడ్డులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఎక్కువ సమయం గడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈమె ప్రస్తుతం పట్టణంలో ఉన్న అన్ని కొవిడ్‌ ఆసుపత్రులకు నోడల్‌ అధికారిగా కూడా పనిచేస్తున్నారు. తణుకు పరిఽధిలోని తణుకు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు గీతా ఆసుపత్రి, సాయిశ్వేతా, సూర్యతేజ ఆర్దోపెడిక్‌, సుధా, వంశీ, సాయి, ఆపిల్‌, ఎస్‌ఎంవిఆర్‌ఎం ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రుగా ఎంపిక చేశారు. ఆయా ఆసుపత్రుల్లో ఐసీయూ మంచాలు 54, ఆక్సిజన్‌ మంచాలు 135, సాధారణ మంచాలు 198 కలిపి మొత్తంగా 387 వరకు ఉన్నాయి. అన్ని ఆసుపత్రులో సౌకర్యాలు, రోగులకు అవసరమైన మంచాలు, ఆక్సిజన్‌, మాస్కులు,  పీపీఈ కిట్‌లు అన్ని అమలు జరుగుతున్నాయా.. లేదా అనేది పర్యవేక్షించాల్సి ఉంది. ఇలాంటి  క్లిష్ట పరిస్థితుల్లో కూడా డాక్టర్‌ చాముం డేశ్వరి నామ మాత్రంగానే విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఉదయం 9నుంచి 4గంటల వరకు విధుల్లో ఉండాలి. కొవిడ్‌ ఉధృతి నేపథ్య ంలో అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ సమయం కూడా చేయాల్సిన అవస రం కూడా ఉంది.  ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్‌ చాముండేశ్వ రిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా ఇక్కడి వైద్యులు ఊరె ళ్ళారని, కొద్దిగా చూడాల ని చెప్పడంతో వచ్చి చూస్తున్నాని బదులిచ్చారు. కొంత కాలం నుంచి అందరి వైద్యులు మాదిరిగానే తాను కూడా ప్రైవేటు వైద్యం చేస్తున్నానని చెప్పడం విశేషం. వాస్తవానికి ప్రభుత్వం పేదలకు వైద్యం అందించాలని వేతనాలు ఇస్తుంటే... కొంతమంది వైద్యులు డ్యూటీ సమయంలో ప్రైవేట్‌ వైద్యం చేస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరో పణలు లేకపోలేదు. ప్రైవేటు వైద్యసేవలు గురించి డాక్టర్‌ చాముండేశ్వరిని వివరణ కోరగా సోమవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సుకు హాజరయ్యానని చెప్పారు. అయితే ఇక్కడి వైద్యులు లేకపోవడం వల్ల వచ్చి చూస్తున్నట్టు వివరించారు. ఇకపై ఉదయం పూట కాకుండా సాయంత్రం సమయంలో మాత్రమే ప్రైవేట్‌ వైద్యం చేస్తానని చెప్పారు.


Updated Date - 2021-06-15T05:15:23+05:30 IST