12 గంటలకు..రోడ్లన్నీ ఖాళీ

ABN , First Publish Date - 2021-05-06T05:55:25+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేసేందుకు రెండు వారాలపాటు విధించిన కర్ఫ్యూ తొలిరోజు విజయవంతమైంది.

12 గంటలకు..రోడ్లన్నీ ఖాళీ
ఏలూరులో ఎటు చూసినా నిర్మానుష్యమే..!

రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో పోలీసు గస్తీ

కిరాణా, మద్యం దుకాణాలు కిటకిట

కొన్నిచోట్ల బస్సులు లేక అసౌకర్యం

ఉదయాన్నే తెరుచుకున్న మద్యం షాపులు


ఏలూరు, మే 5(ఆంధ్రజ్యోతి):

కరోనా సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేసేందుకు రెండు వారాలపాటు విధించిన కర్ఫ్యూ తొలిరోజు విజయవంతమైంది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డా యి. ప్రజలు ఎవరికి వారు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. బస్సులు ఎక్కడికక్క డ నిలిచిపోయాయి. ప్రభుత్వం మిన హాయింపు ఇచ్చిన అత్యవసర సేవలు మినహా మిగిలి నవి నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం లో మాత్రం పెట్రోలు బంకులు మూసేశారు.

ల్లాలో బుధవారం ఉదయం నుంచే కర్ఫ్యూ ప్రభావం కనిపించింది. అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలోనే షాపులు, దుకాణాలు, మార్కెట్లు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం నుంచి అన్నీ బంద్‌ కానుండడంతో పెద్ద సంఖ్యలో జనం మార్కెట్లకు తరలి వచ్చారు. దీంతో నిత్యావసర సరుకులు, మందుల షాపులు, మార్కెట్ల వద్ద రద్దీ కనిపించింది. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఉదయం ఐదు గంటల నుంచే బారులు తీరారు. కొద్దిరోజులుగా లాక్‌డౌన్‌ పెడతారన్న ప్రచారం జరుగుతుండడంతో మంగళవారం నాటికే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. నరసాపురం, బీమవరం, తణుకు, నిడ దవోలు, కొవ్వూరు వంటి పట్టణాల్లో రద్దీ స్వల్పంగానే ఉండగా, ఏలూరు, తాడేపల్లిగూడెం మారెట్లు, భీమవ రం వారపు సంతలో మాత్రం ఉదయం రద్దీ కనిపిం చింది. భీమవరం మామిడిపండ్ల సంతను అధికారు లు ముందుగానే హైస్కూలు గ్రౌండుకు తరలించడం తో జనం గుంపులుగా పోగుపడే బాధ తప్పింది. 


ప్రయాణికులకు ఇక్కట్లు

కర్ఫ్యూ కారణంగా జిల్లాలో బస్సులు ఉదయం పదకొండున్నర వరకే అందుబాటులో ఉన్నాయి. దీని కితోడు ప్రజా రవాణా శాఖ 572 బస్సులకు గాను 134 బస్సులను మాత్రమే తిప్పింది. బస్సుల సంఖ్య బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు ఇబ్బం దులకు గురయ్యారు. కర్ఫ్యూ కారణంగా చాలామంది ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే రద్దు చేసుకున్నారు. తప్పనిసరై ప్రయాణాలు పెట్టు కున్న వారు అసౌకర్యానికి గురయ్యారు. తాడేపల్లి గూడెం నుంచి రాజమండ్రి, ఏలూరు వెళ్లాల్సిన ప్ర యాణికులు, ఏలూరు నుంచి విజయవాడ, రాజమం డ్రి వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ఉండడంతో తొలిరోజు మధ్యాహ్నం కొన్ని అందుబాటులోకి ఉన్నాయి. గురువారం నుంచి వాటి ని నిలిపివేస్తున్నట్లు పీటీడీ అధికారులు ప్రకటించా రు. ప్రైవేటు రవాణా సేవలందించే ఆటోలు, క్యాబ్‌లు మధ్యాహ్నం 12 తరువాత నిలిచిపోవడంతో పట్టణా లకు వచ్చి ఇరుక్కుపోయిన పల్లెవాసులు ఇరుకున పడ్డారు. ప్రైవేటు వాహనదారులు స్వచ్ఛందంగా కర్ఫ్యూను పాటించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు రోడ్లపై కనిపించలేదు. మధ్యాహ్నం 12 తర్వాత ప్రధా న రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. 


 చుక్క కరువే

బుధవారం మధ్యాహ్నం నుంచి టీ స్టాళ్లు, టిఫిన్‌ సెంటర్లు, భోజన హోటళ్లు సహా మొత్తం మూతపడి పోయాయి. దీంతో కొవిడ్‌ బాధితుల సహాయార్థం కొవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లు, సాధారణ వైద్య శాలలకు వచ్చిన వారి బంధువులు చాలా ఇబ్బందు లకు గురయ్యారు. కొవిడ్‌ బాధితులకు తిండి ఏర్పా ట్లున్నా వారికి తోడుగా వచ్చిన వారు దగ్గరలో ఉన్న టిఫిన్‌ సెంటర్లపై ఆధారపడ్డారు. మధ్యాహ్నం నుంచి అవి అందుబాటులో లేకపోవడంతో వారికి టీ నీళ్లు  కూడా దొరకలేదు. 


పోలీసులపై తగ్గిన భారం

కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాముల వడంతో పోలీసులపై భారం తగ్గింది. ప్రజలు తమం త తామే నియంత్రణ విధించుకోవడం, షాపులను స్వచ్ఛందంగా మూసేయడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కిందటేడాది మాదిరిగా షాపులు మూయించడం, ప్రయాణాలను అడ్డుకోవడం వంటి బలవంతాలు, వా దోపవాదాలు ఈసారి కనిపించలేదు. 


జిల్లా రాష్ట్ర సరిహద్దుల్లో గస్తీ

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య వున్న జీలుగు మిల్లి సరిహద్దులో చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాత వాహనాలను ఆంధ్రలోకి రానివ్వలేదు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల మధ్య యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద పోలీసులు గస్తీ నిర్వహించారు.  



Updated Date - 2021-05-06T05:55:25+05:30 IST