Abn logo
Sep 24 2021 @ 23:58PM

కొలువుదీరారు

పెదపాడు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి

మండల పరిషత్‌ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం

 ఏలూరు రూరల్‌, సెప్టెంబరు 24 : మండల పరిషత్‌ నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. శుక్రవారం అయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు తొలుత ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ,  కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ మేరకు వారు ప్రమాణ స్వీకారం చేశారు. 


 ఏలూరు ఎంపీపీగా శ్రీనివాసరాజు..

ఏలూరు మండల పరిషత్‌ నూతన పాలక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం ఏలూరు మండల పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. పాలకవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి సుబ్రహ్మణ్యేశ్వర రావు ప్రమాణ స్వీకా రం చేయించారు. ఎంపీపీగా పెన్మెత్స శ్రీనివాసరాజు, ఉపాధ్యక్షురాలిగా బోడిగడ్డ కుమారి, కో ఆప్షన్‌ సభ్యురాలిగా మారుమూడి జ్యోతి జరీనా ప్రమాణ స్వీకారం చేశారు. 13 మంది ఎంపీటీసీలు, విప్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవికి శ్రీనివాసరాజు, బోడిగడ్డ కుమారి ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. ముఖ్య అతిథిగా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్య చౌదరి పాల్గొని మండల పరిషత్‌ నూతన పాలకవర్గాన్ని అభినందిం చారు. రాజకీయాలకు అతీతంగా జనరంజకమైన పాలన అందిస్తానని ఎంపీపీ పెన్మెత్స శ్రీనివాసరాజు అన్నారు.  ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి సత్కరించారు.  కాగా నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారంతో 2019 ఆగస్టు 2 నుంచి అమ లులో ఉన్న ప్రత్యేకాధికారుల పాలన ముగిసింది.  


  దెందులూరు ఎంపీపీగా సుమలత..

దెందులూరు, సెప్టెంబరు 24 : దెందులూరు మండల ప్రజా పరిషత్‌ (ఎంపీ పీ) అధ్యక్షురాలిగా పోతునూరు నుంచి ఏకగ్రీవంగా ఎంపికైన ఎంపీటీసీ బొమ్మ నబోయిన సుమలత, వైస్‌ ఎంపీపీగా సోమవరప్పాడు ఎంపీటీసీ వేమూరి జితేంద్ర కుమార్‌లకు వైసీపీ బీఫామ్‌ను మండల వైసీపీ అధికార ప్రతినిధి కామిరెడ్డి నాని అంద జేశారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అధ్యర్యంలో  వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. మండల ప్రత్యేకాధికారి లీలా మోహన్‌, ఎంపీడీవో అధ్వర్యంలో ఎంపీటీసీలు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకున్నారు. మండల విప్‌గా రామారావుగూడెం ఎంపీటీసీ కాలి ఇశ్రాయిలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఫ్లోర్‌ లీడర్‌గా మేదినరావుపాలెం ఎంపీటీసీ అంగడాల వెంకటేశ్వర రావు, కోఆప్షన్‌ సభ్యుడిగా పులిపాటి ఆనందబాబులను ఎన్నుకున్నారు.  కొవ్వలి ఎంపీటీసీ అత్కూరి లక్ష్మీ సరోజిని, ఎంపీటీసీలు బాపూజీ, వైసీపీ నేతలు దూళ్లిపాళ్ల నాగేంద్ర వరప్రసాద్‌, యలమర్తి రామకృష్ణ, గూడపాటి పవన్‌ కుమార్‌, పోకల రాంబాబు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ ఎంపీటీసీలు పెనుబోయిన శేషారత్నం, బలుసు రాంబాబు, సింహద్రి పద్మావతి ప్రమాణం చేశారు.


  పెదపాడు ఎంపీపీగా రత్నకుమారి..

పెదపాడు, సెప్టెంబరు 24 : పెదపాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీల పదవీ ప్రమాణ స్వీకారం ఆర్వో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఎంపీపీగా బత్తుల రత్నకుమారి, వైస్‌ ఎంపీపీగా అప్పన పద్మావతి, ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కోఆప్షన్‌ సభ్యుడిగా యెహాషువాను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు. జడ్పీటీసీ సభ్యురాలు ఘంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ అప్పన ప్రసాద్‌, ఇంద్రకీలాద్రి టస్‌్ట్రబోర్డు మెంబరు ఘంటా ప్రసాదరావు, సొసైటీ అధ్యక్షుడు అక్కినేని రాజశేఖర్‌, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్‌చౌదరి, వడ్డీల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఘంటశాల ప్రభాకరావు, వ్యవసాయ సలహా సంఘ చైర్మన్‌ గొట్టాపు నరసింహా రావు, బత్తుల ఏసురాజు, ఎంపీటీసీ అక్కినేని గోపి, విజిలెన్స్‌ మోనటరింగ్‌ కమిటీ మెంబ రు కత్తుల రవికుమార్‌, మెడబలిమి సంతోష్‌కుమార్‌, మరీదు రెడ్డియ్య, పూడి రంగ అప్పారావు, తుంద్రురు క్రాంతికుమార్‌, కొత్తూరి విమలరావు, తహసీల్దారు ఇందిరాగాంధీ, ఎంపీడీవో విశ్వనాధ్‌, ఎంఈవో నరసింహామూర్తి తదితరులు పాల్గొన్నారు.


  పెదవేగి ఎంపీపీగా రమ్య..

పెదవేగి, సెప్టెంబరు 24 : పెదవేగి ఎంపీపీగా పెదవేగి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన తాతా రమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల ఉపాఽద్యక్షురాలిగా గార్లమడుగు ఎంపీటీసీ సభ్యురాలు మేడికొండ ఉమాదేవిని ఎన్నుకున్నారు. కోఆప్షన్‌ సభ్యుడిగా వేగివాడకు చెందిన పాకలపాటి ఫిలిప్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంకన్నగూడెం ఎంపీటీసీ సభ్యుడు పిల్లి రామకృష్ణను మండల పరిషత్‌ విప్‌గా ఎన్నుకున్నారు. పినకడిమి ఎంపీటీసీ సభ్యురాలు గెడ్డం సుజాత, ఎంపీపీ అభ్యర్థిగా రమ్యను ప్రతిపాదించగా, దుగ్గిరాల ఎంపీటీసీ సభ్యురాలు పులవర్తి సరోజిని బలపరిచారు. మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో రమ్యను ఎంపీపీగా ఎన్నికల అధికారి టీవీ.సుబ్బారావు ప్రకటించారు. మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్‌ సభ్యుడితో పాటు ఇతర ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అభినందించారు. కార్యక్రమంలో ఏపీ ఆయిల్‌ఫెడ్‌ రైతుకమిటీ చైర్మన్‌ కొఠారు రామచంద్రరావు, దెందులూరు ఏఎంసీ చైర్మన్‌ మేకా లక్ష్మణరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మెట్లపల్లి సూర్యచంద్రరావు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.