హమ్మయ్య.. వింత వ్యాధి కేసులు లేవు

ABN , First Publish Date - 2021-01-26T05:37:45+05:30 IST

దెందులూరు, భీమడోలు మండలాల్లో సోమవారం ఒక్క వింత వ్యాధి కేసు నమోదు కాలేదు.

హమ్మయ్య.. వింత వ్యాధి కేసులు లేవు

దెందులూరు/భీమడోలు జనవరి 25: దెందులూరు, భీమడోలు మండలాల్లో సోమవారం ఒక్క వింత వ్యాధి కేసు నమోదు కాలేదు. పూళ్ల, భీమడోలు, గుండు గొలను, కొమిరేపల్లిల్లో ఇప్పటి వరకు 69 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. కొమిరేపల్లిలో 31 మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడగా 25 మంది బాధితులు ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు. ప్రభుత్వం ఇంకా వ్యాధి నిర్ధారణ చేయలేదు. ప్రభుత్వం ప్రస్తుతం కొమిరేపల్లిలో వైద్య శిబిరం కొనసాగుతున్నది. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి బాధిత కుటుంబాలను పరామర్శించారు.


Updated Date - 2021-01-26T05:37:45+05:30 IST