కరోనా వేళ కానరాని సాయం

ABN , First Publish Date - 2021-05-17T05:32:17+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోయిన పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు.

కరోనా వేళ కానరాని సాయం

 కరోనా మొదటి వేవ్‌లో జోరుగా నేతల చేయూత 

 అప్పట్లో ఎన్నికల హడావుడి.. ఈసారి ముఖం చాటేశారు

 ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పేద ప్రజలు

 స్వచ్ఛంద సంస్థల సాయం అంతంతమాత్రమే


ఏలూరు కలెక్టరేట్‌ / పెదపాడు, మే 16

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో ఉపాధి కోల్పోయిన పేదలకు అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. దీనికి కారణం ఇప్పట్లో ఎటువంటి ఎన్నికలు లేక పోవడమేని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. గతేడాది దాతలు స్వచ్ఛందంగా పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్క్‌లను సైతం అందజేశారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన పాక్షిక కర్ఫ్యూతో వేతన జీవులు, పేద, మధ్యతరగతి, కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈసారి దాతల నుంచి ఎటువంటి సాయం అందడం లేదు. 

గతేడాది తొలిసారి కరోనా వచ్చి నప్పుడు లాక్‌డౌన్‌ విధించారు. చాలా మంది ఉపాధి పోయి ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారితో పాటు చాలా మంది పేదలు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతి నిధులు, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో పేదల ఇళ్లకు బియ్యం, పప్పులు, నూనె, నిత్యావసరాలు అందజేసి దాతృత్వాన్ని చాటుకు న్నారు. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ అన్ని గ్రామాల్లోనూ కబళిస్తోంది. కర్ఫ్యూతో వి విధ రంగాల్లోని వారు ఉపాధి కోల్పోయారు. కూలీలు పనులు దొరక్క ఇబ్బం దులు పడుతున్నారు. అయితే గతేడాదిలా ఈసారి పేదలకు ప్రజాప్రతిని ధులు ఎటువంటి సాయం అందించడం లేదు గతసారి స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న లెక్క చేయకుండా తమ నాయకులు గెలుపుకోసం ఇంటింటికీ తిరిగి సాయం అందిం చారు. కొందరు నాయకులు కరోనా జాగ్రత్తలు చెబు తూనే మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సమయంలో ప్రజా ప్రతినిధులు ఎవ్వరు కనిపించడం లేదు. కనీసం ఆస్పత్రి లో వైద్య సేవలు ఎలా అందుతున్నాయంటూ వాకబు చేసిన నాయకుడు లేడంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో రోడ్డున పడిన కుటుంబాలను పట్టించుకునేవారే కరువయ్యారని వాపోతున్నారు. గతసారి స్వచ్ఛంద సంస్థలూ ముందుకొచ్చి సాయం చేశాయి. అయితే ప్రస్తుతం స్వ చ్ఛంద సంస్థల సాయం కూడా అంతంతమాత్రంగానే అందుతోంది. 

Updated Date - 2021-05-17T05:32:17+05:30 IST