65 నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-03T05:50:33+05:30 IST

నగరపాలక సంస్థకు ఈనెల 10వ తేదీన జరగనున్న ఎన్ని కలకు సంబంధించి మంగళవారం 65 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు.

65 నామినేషన్ల ఉపసంహరణ

 నేడు తుది గడువు

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, మార్చి 2 : నగరపాలక సంస్థకు ఈనెల 10వ తేదీన జరగనున్న ఎన్ని కలకు సంబంధించి మంగళవారం 65 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. వీటిలో వైసీపీ 36 మంది, టీడీపీ 17, జనసేన 5, సీపీఐ 1, ఇంటిపెండెంట్లు 6 ఉన్నారు. గత ఏడాది మార్చి 13వ తేదీ వరకూ నామి నేషన్లకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. 14వ తేదీ నామినేషన్ల పరిశీలన చేశారు. అదే నెల 15వ తేదీన కరోనా కారణంగా ఎన్నికల సంఘం ఎన్నిక లను నిలిపివేసింది. అప్పటికి 50 డివిజన్లల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్ధులు 287 మంది నామినేషన్లు దాఖలు చేయగా పరిశీలనలో ఒక నామినేషన్‌ తిరస్క రించబడింది. మరో నలుగురు అభ్యర్ధులు  ఒక్కొ క్కరు రెండు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం ఐదు నామినే షన్లు తిరస్కరణకు గురికాగా 282 నామినేషన్లు అధికారులు ఖరారు చేశారు. ఎన్నికల సంఘం  మరల తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి ఫిబ్రవరి లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానికి ప్రకారం ఈనెల 2, 3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. అయితే మంగళవారం 65 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. దీంతో ఇప్పటి వరకూ 217 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇంకా మూడో తేదీ బుధవారం కూడా నామినేషన్లు ఉపసంహరిం చుకునే అవకాశం ఉంది. 1, 3 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు మినహా మిగిలిన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా తమ నామినేషన్లు ఉపసంహరిం చుకున్నారు. ఈ రెండు డివిజన్లు ఏకగ్రీవంగా వైసీపీ దక్కించుకున్నది. 

1, 3, 32  డివిజన్లు ఏకగ్రీవం

 నగరపాలక సంస్థకు జరగబోయే ఎన్నికల్లో మూడు డివి జన్లు ఏకగ్రీవం అయ్యాయి. ఒకటవ డివిజన్‌ నుంచి ఆరు నామినేషన్లు దాఖలు కాగా ఐదు గురు మంగళవారం ఉపసంహరించు కున్నారు. వైసీపీ అభ్యర్థి ఆర్నేపల్లి అనూరాధ ఒక్కరే బరి లో  మిగిలారు. మూడో డివిజన్‌ నుంచి నాలు గు నామినేషన్లు దాఖలు కాగా ముగ్గురు ఉప సంహరించుకున్నారు. వైసీపీ అభ్యర్థి బొద్దాని అఖిల ఒక్కరే బరిలో మిగిలారు. 32వ డివిజన్‌ లో మూడు నామినేషన్లు దాఖలు కాగా ఇద్దరు ఉపసంహరించుకున్నారు. వైసీపీ అభ్యర్థి సునీ తారత్నకుమారి ఒక్కరే మిగిలారు. ఈ మూడు ఏకగ్రీవాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 


Updated Date - 2021-03-03T05:50:33+05:30 IST