ఉద్యమం ఉధృతం

ABN , First Publish Date - 2022-01-28T06:12:54+05:30 IST

ప్రభుత్వం ప్రకటిం చిన తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆందోళన తీవ్రం చేశారు.

ఉద్యమం ఉధృతం
కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ సంఘాల రిలే దీక్షలు

 రివర్స్‌ పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల రిలే దీక్షలు
 భారీగా హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు

ఏలూరు కలెక్టరేట్‌, జనవరి 27 : ప్రభుత్వం ప్రకటిం చిన తిరోగమన పీఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆందోళన తీవ్రం చేశారు. కొద్దిరోజులుగా దశల వారీ ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యోగులు గురువారం నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. పీఆర్సీకి వ్యతిరేకంగా అర్ధరాత్రి జారీచేసిన జీవోలకు వ్యతిరేకంగా.. ‘అప్పుడేమో ముద్దులు.. ఇప్పుడేమో గుద్దులు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఫిబ్రవరి 7 నుంచి జరగబోయే సమ్మెతో తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అసం బద్ధ పీఆర్సీ, చీకటి జీవోలను రద్దు చేయాలని, అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదికలను బహిర్గతం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. పీఆర్సీ సాధన సమితి నేతలు ఆర్‌.ఎస్‌.హరనాఽథ్‌, చోడగిరి శ్రీనివాస్‌, కె.రమేష్‌ కుమార్‌, ఎల్‌.విద్యాసాగర్‌, దాసరి కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. నాయకులు ఏపీజీఈఏ, ఏపీసీటీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్‌.సూర్యనా రాయణ, ఫ్యాప్టో చైర్మన్‌ సీహెచ్‌.జోసెఫ్‌ సుధీర్‌బాబు, చేబ్రోలు కృష్ణమూర్తి, రమేష్‌కుమార్‌ శిబిరాన్ని సందర్శించి ఉద్యోగు లనుద్ధేశించి మాట్లాడారు. తమపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, పదకొండు సార్లు చర్చలకు పిలిచినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేద న్నారు. తమకు అశుతోష్‌మిశ్ర పీఆర్సీనా, అధికారులు ఇచ్చిన నివేదికనా, లేకుంటే సెంట్రల్‌ పే కమిషన్‌ ఇస్తున్నారా ప్రభుత్వం తేల్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ సెంట్రల్‌ స్కేల్స్‌ ఇస్తే తమ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ జీవోలతో వేతన పెరుగుదలకాక తగ్గు దల వస్తుందన్నారు. జీవోలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏపీజీఈఏ, ఏపీ సిటీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.ఎం.రమేష్‌కు మార్‌, ఉపాధ్యక్షుడు ఎస్‌.రవిశంకర్‌, జిల్లా అధ్యక్షుడు పి.జె.శేషు కుమార్‌, జిల్లా కార్యదర్శి బి.శివప్ర సాద్‌ ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:12:54+05:30 IST