మా సమస్యల మాటేమిటి..?

ABN , First Publish Date - 2021-12-06T05:09:30+05:30 IST

కుక్కునూరు మండలంలో 41.15 కాంటూర్‌ లెవెల్లో 8 గ్రామాలు ముంపు నకు గురవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

మా సమస్యల మాటేమిటి..?
గొమ్ముగూడెం గ్రామం

పునరావాస పరిహారానికి నోటిఫికేషన్లు 

కుక్కునూరు మండలంలో రెండు గ్రామాలకు తాజాగా ప్రకటన

పోలవరం నిర్వాసితుల్లో ఆవేదన.. 


పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూర్‌ లెవెల్లో ముంపునకు గురవుతున్న గ్రామాలకు సంబంధించి భూసేకరణ, పునరావాసం, పునస్థాపన (ఆర్‌అండ్‌ఆర్‌) నోటిఫికేషన్‌లు వరుసగా జారీ అవుతున్నాయి. అయితే తమ సమస్యలు పరిష్కరించకుండానే ప్రభుత్వం ముందుకు సాగడంపై నిర్వాసితుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. కుక్కునూరు మండలంలో రెండు గ్రామాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా భూసేకరణకు ప్రకటన జారీచేసింది. 

 

కుక్కునూరు, డిసెంబరు 5 : కుక్కునూరు మండలంలో 41.15 కాంటూర్‌ లెవెల్లో 8 గ్రామాలు ముంపు నకు గురవుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల వ్యవధిలో గొమ్ముగూడెం, రామచంద్ర పురం ముంపు గ్రామా ల్లోని నిర్వాసితులకు సంబంధించి ప్రకటన జారీ అయ్యింది. ముంపునకు గురవుతు న్నందున ఆ గ్రామాల్లో భూమి కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. సర్వే నెంబరు, రైతు పేరు, భూమి తరగతి, డోర్‌ నెంబరు, విస్తీర్ణం, అందులోని కట్టడాలు, చెట్ల వివరాలను నోటిఫికేషన్‌లో పొందు పర్చారు. రాజమహేంద్రవరంలోని స్పెషల్‌ కలెక్టర్‌ (భూసేకరణ) పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నుంచి ప్రకటనలు విడుదలయ్యాయి. ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఏలూరు, రాజమహేంద్రవరంలో ఉన్న పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో అభ్యర్థనలు తెలపవచ్చని కోరారు. 


వెంటాడుతున్న నిర్వాసితుల సమస్యలు 

పునరావాస పరిహారంపై ప్రకటనలు జారీ అవుతుండగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిర్వాసితుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. గతంలో రూ.1.15 లక్షలు పొందిన భూములకు సీఎం హామీ మేరకు రూ.5 లక్షలు ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన వారికి గతంలో ఇచ్చిన కటాఫ్‌ తేదీని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుతం తరలిస్తున్న తేదీలను కటాఫ్‌ తేదీగా తీసుకుని అర్హులుగా ప్రక టించాలని కోరుతున్నారు. గిరిజనేతరులైన  గొమ్ముగూడెం, రామచంద్రపురం గ్రామాల నిర్వాసితు లను జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో నిర్మిస్తున్న పునరావాస కాలనీకి తరలించనున్నారు. ఈ నేపఽథ్యంలో అక్కడ నుంచి వచ్చి మిగులు భూములను సాగు చేసుకోలేమని వాటికి కూడా పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. గొమ్ముగూడెం గ్రామంలో దాదాపు 70 మంది యువతీ, యువకులకు ప్రస్తుతం 18 సంవ త్సరాలు నిండి ఉన్న క్రమంలో వారిని పునరావాస పరిహారానికి అర్హులను చేయాలని డిమాండ్‌ చేస్తు న్నారు. కేఆర్‌పురం ఐటీడీఏలో పలుమార్లు దరఖాస్తులు కూడా అందజేశారు. పునరావాస పరిహారం, వ్యక్తిగత పరిహారం, ఇంటి పరిహారం ఒకేసారి ఇవ్వాలని కోరుతున్నారు. స్థానికంగా ఉండటం లేదని కొందరిని, కటాఫ్‌ తేదీ కంటే ముందే పెళ్లయిందని పలువురిని పున రావాస జాబితా నుంచి తొలగించారు. ఈ క్రమంలో ఇటీవల ఐటీడీఏ పీవో నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గ్రీవెన్స్‌లో పునరావాస పరిహారానికి అర్హులను చేయా లంటూ దరఖాస్తు చేసుకున్న వారంతా తమ ధ్రువీకరణ పత్రాలను ఐటీడీఏ కార్యాలయంలో వెరిఫికేషన్‌ చేయిం చుకోవాలని సూచించారు. దీంతో కుక్కునూరు–ఎ బ్లాక్‌ లోని పలువురు నిర్వాసితులు కేఆర్‌పురం వెళ్లి ధ్రువీ కరణ పత్రాలు అందజేస్తున్నారు. త్వరలో కుక్కునూరు–ఎ బ్లాక్‌కు సంబంధించి పునరావాస పరిహారం నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని సమాచారం.


సర్వేలతోనే సరా..?

 వేలేరుపాడు, డిసెంబరు 5 : వేలేరుపాడు ముంపు మండలాల్లో వివరాల సేకరణకు ఇంకా సర్వేలు సాగు తూనే ఉన్నాయి. మండలంలో మొత్తం 7 పంచా యతీ లకు సంబంధించి 40 గ్రామాలు ముంపునకు గురవుతు న్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆర్‌అండ్‌ఆర్‌ సర్వేకు సంబంధించి 2017 సంవత్సరం నుంచి ఇప్పటికి దాదాపు 10 సార్లుకు పైనే మండలంలో సర్వేలు చేశారు. తాజాగా గత ఏప్రిల్‌ నెలలో ఇళ్లకు సంబంధించి సర్వే పూర్తిచేసిన అధికారులు జూలై, ఆగస్టు నెలల్లో పరిహారం చెల్లిస్తా మని చెప్పారు. డిసెంబరు నెల వచ్చినా పరిహారం చెల్లింపుల ఊసే ఎత్తని అధికారులు తాజాగా మరోసారి ఇళ్ల సర్వే ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. సోమవారం రేపాకగొమ్ము గ్రామ పంచాయతీలోని ఎ–బ్లాక్‌లో సర్వే నిర్వహించను న్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ మేరకు గృహ యజమానులందరూ అందు బాటులో ఉండాలంటూ గ్రామ వలంటీర్ల ద్వారా తెలియజేశారు. ఇంకెన్ని సార్లు సర్వే చేస్తారంటూ నిర్వాసితులు విస్మయానికి గురవుతున్నారు.

Updated Date - 2021-12-06T05:09:30+05:30 IST