విపత్తులను సంసిద్ధతతో ఎదుర్కోవాలి

ABN , First Publish Date - 2022-01-20T06:03:13+05:30 IST

జిల్లాలో ఏ విపత్తు సంభవించినా అందరూ సంసి ద్ధతతో ఎదుర్కోవడానికి మెలకువలు తెలుసుకోవాలని జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి అన్నారు.

విపత్తులను సంసిద్ధతతో ఎదుర్కోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి

జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి

ఏలూరుక్రైం, జనవరి 19 : జిల్లాలో ఏ విపత్తు సంభవించినా అందరూ సంసి ద్ధతతో ఎదుర్కోవడానికి మెలకువలు తెలుసుకోవాలని జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బి.వి.కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆవరణలోని రెడ్‌ క్రాస్‌ భవనంలో జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులకు విపత్తుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఒక రోజు శిక్షణ బుధవారం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా కృష్ణారెడ్డి పాల్గొని తొలుత రెడ్‌క్రాస్‌ వ్యవస్థాపకుడు జీన్‌హెన్రీ డ్యూనాట్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ, ఇరిగేషన్‌, హార్టికల్చర్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌శాఖ, విద్యాశాఖ తదితర శాఖలకు చెందిన అధికారు లకు విపత్తుల నిర్వహణపై వివిధ అంశాలకు సంబంధించిన ఒకరోజు శిక్షణ ఇచ్చారని, జిల్లాలో ఏ విపత్తు సంభవించినా అందరూ సంసిద్ధతతో వాటిని ఎదు ర్కోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ప్రస్తుతం  అందరూ ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు కరోనా వైరస్‌ అని, అందరూ నివా రణ చర్యలు, వ్యక్తిగత జాగ్రత్త వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అఽథారిటీ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ సి.పూర్ణచంద్‌, రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రోగ్రాం ఆఫీసర్‌ పి.అన్నమ్మ, రెడ్‌క్రాస్‌ రీసోర్స్‌పర్సన్‌ సి.హెచ్‌.సత్య నారాయణ విపత్తుల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. అనంతరం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బి.బెన్ని, రెడ్‌క్రాస్‌ కాంపోనెంట్‌ బ్లడ్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ఆర్‌.కె. వరప్రసాద రావు, గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:03:13+05:30 IST