Abn logo
May 18 2021 @ 00:09AM

ఘనంగా శంకర జయంతి వేడుకలు

భీమవరం టౌన్‌ / పాలకొల్లు అర్బన్‌, మే 17 :  భీమవరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శంకర జయంతి ఘనంగా నిర్వహించారు.   పురోహితులు వేద పారాయణ చేశారు. సంఘ అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్‌ , బ్రహ్మజోశ్యుల సుబ్బయ్య, వేలూరి బుజ్జి, శనివారపు రాము, దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. మావుళ్ళమ్మ ఆలయంలో ఆలయ ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో శంకర జయంతి పూజలు చేశారు. స్వామివారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేసారు. ఆంధ్రప్రదేశ్‌ పురోహిత, బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో వేదపండితుడు ఈమని రామచంద్ర సోమాయాజికి గురువందనం చేసి సత్కరించారు. సోమయాజి మాట్లాడుతూ సనాతన ధర్మనాన్ని, హిందూ ధర్మాని కాపాడలంటే జగద్గురువు ఆదిదశంకరులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యామిజాల నర్సింహమూర్తి, పొదిల నారాయణమూర్తి, బుజ్జి, మావుళ్ళమ్మ దేవస్ధానం ప్రధానార్చకుడుమద్దిరాల మల్లిఖార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.   పాలకొల్లు క్షీరా రామ లింగేశ్వరస్వామి ఆలయంలో క్షీరారామ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో శంకరాచార్యుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరా రామలింగేశ్వరస్వామికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. బ్రాహ్మణ సంఘం నాయ కులు సోమంచి శ్రీనివాసశాస్త్రి, వైఎన్‌ఆర్‌, హోతా హరినారాయణ, ట్రస్టీ నేదునూరి మధుసూధనరావు, ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, అర్చకులు మల్లిఖార్జునరావు, కిష్టప్ప, పూర్ణయ్య, మద్దూరి సూరిబాబు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కోడిగట్టున ఉన్న శంకరమఠంలో అర్చకులు కామరాజు, భాస్కర్‌ల ఆధ్వర్యంలో శంకరా చార్యుల వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు  నిర్వహించారు 


Advertisement
Advertisement
Advertisement