ప్రజలకు మెరుగైన సేవలందించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-17T05:03:47+05:30 IST

అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించి ప్రజల కు మెరుగైన సేవలు అందిం చాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దే వ్‌ శర్మ అన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలి : ఎస్పీ
సిబ్బందితో కలిసి భోజనం చేస్తున్న ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ

ఏలూరు క్రైం, అక్టోబరు 16 : అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించి ప్రజల కు మెరుగైన సేవలు అందిం చాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ దే వ్‌ శర్మ అన్నారు. జిల్లా స్పెషల్‌ పార్టీ పోలీస్‌ సిబ్బందికి విజయ దశమి సందర్భంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఉన్నత విద్యార్హతలు ఉన్న సిబ్బంది పోటీ పరీక్షలకు సంసిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా సిబ్బందికి భోజ నాలు వడ్డించి, కలిసి భోజనం చేశారు. 

 న్యాయస్థానాలకు, పోలీస్‌ స్టేషన్లకు అనుసంధానం గా వ్యవహరిస్తున్న కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో అమోఘమని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అన్నారు. శనివారం జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్లలో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో కోర్టు కానిస్టేబుళ్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన కోర్టు విషయాలపై కోర్టు కానిస్టేబుళ్లు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఏఆర్‌ సిబ్బంది విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సూచించారు. ఏపీ ఎస్పీ నుంచి ఆర్ముడు విభాగానికి 23 మంది, ఆర్ముడు రిజర్వుడ్‌ విభాగం నుంచి సివిల్‌కు ఐదు గురు ఉద్యోగులు బది లీపై వచ్చి శనివారం ఎస్పీని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి పలు సూచనలు చేశారు. 

Updated Date - 2021-10-17T05:03:47+05:30 IST