Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పందనలో ఫిర్యాదుల వెల్లువ

 ఏలూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనకు సోమవా రం అర్జీదారులు బారులు తీరారు. మొత్తం 327 వినతులు రాగా, వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 113, పింఛన్లకు 37, పంచాయతీ రాజ్‌ 34, పోలీసు 24, మున్సిపాలిటీ 19, పౌర సరఫరాలు 13, గృహ నిర్మాణం 11, ఇతర శాఖ లకు చెందిన వినతులు ఏడు ఉన్నాయి. వీటిని ఆయా శాఖలు సకాలంలో పరిష్కరించాలని జేసీ బీఆర్‌ అంబేడ్కర్‌ అధికారులను ఆదేశిం చారు. జేసీ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. 


పింఛను ఆపేశారు

‘గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ప్రతి నెలా దివ్యాంగుల పింఛన్‌ మూ డు వేలు ఇచ్చేవారు. ఎందుకో తెలియదు 3 నెలల నుంచి పింఛన్‌ ఆపేశారు. వలంటీర్లను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతు న్నారు. దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు’ అని ఏలూరుకు చెందిన చోటూ తల్లి జమీలా అహ్మద్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు. 


ఆరేళ్లుగా తిరుగుతున్నా

‘నా బిడ్డ కనీసం నిలుచోలేడు, కూర్చోలేడు. అన్నీ మంచంపైనే. నేనే మోసుకుంటూ తిప్పాలి. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే 2014లో సదరం సర్టిఫికేట్‌ ఇచ్చారు. కానీ, అందులో ముల్కు ఏసు అని పేరు తప్పుగా రాశారు. దీనిని సరిచేసి పింఛన్‌ ఇవ్వమంటే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆరేళ్లుగా తిరుగుతున్నా. కలెక్టర్‌గారే దయ చూపించాలి’ అని నరసాపురానికి చెందిన ముల్కు మంగ స్పందనలో అభ్యర్థించారు.  

Advertisement
Advertisement