ఏలూరు, రావిచెర్లలలో భార్య ఇక లేదని భర్త, తల్లి మరణంతో కుమార్తె బలవన్మరణాలు
కాపవరం, దువ్వలలో కుటుంబ కలహాలతో భార్యలను నరికి చంపిన భర్తలు
ఏలూరు క్రైం, జనవరి 15 :
తమ వారు దూరమయ్యారనే మనో వేదనకుగురై.. వారిపై వున్న అతి ప్రేమ కారణంగా ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా.. కుటుంబ కలహాల నేపథ్యంలో అపురూపంగా చూసుకోవాల్సిన భార్యలపై ఇద్దరు భర్తలు పగ బట్టి కిరాతకంగా నరికి చంపారు. ఈ నాలుగు ఘటనలు సంక్రాంతి పండుగ రోజుల్లో ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
భార్య లేని లోకంలో తాను జీవించలేనని భర్త, తల్లి మరణంతో తల్లడిల్లిన కుమార్తె పండుగ వేళ బలవన్మరణం పొందారు. వివరాలివ.. కృష్ణా జిల్లా నూజివీడు మండలం రావిచెర్లకు చెంది న తులిమిల్లి ముత్యాలు(80) భార్య ఇటీవల మరణించింది. ఆమె జ్ఞాపకాల నుంచి బయట పడలేక తీవ్ర మనోవేదనతో తల్లడిల్లుతున్నా డు. ఆమె లేని లోకంలో జీవించలేనని భావిం చి సంక్రాంతి పండుగ రోజు ఆత్మహత్య చేసు కోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిం దపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే స్టేషన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలా న్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో తల్లి మరణించిందని మనస్తాపం తో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఏలూరు టూ టౌన్ గానుగులపేటలో ఒమ్మి లలిత (40), కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు భర్త, కుమార్తెతోపాటు తల్లితో కలిసి ఉంటున్నది. ఇటీవల తల్లి మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురై శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటి ముందున్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ ఎన్ఆర్ కిశోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు రూరల్/పెరవలి జనవరి 15: కుటుంబ కలహాలు.. ఇద్దరి మహిళల ప్రాణా లు తీశాయి. భర్తలే వారి పాలిట యమదూత లుగా మారి కత్తులతో నిర్ధాక్షణ్యంగా నరికి చం పారు. పోలీసులు తెలిపిన వివరాలివి.. తణుకు మండలం దువ్వ వయ్యేరు ఏటిగట్టున పచ్చాల వరలక్ష్మి(31) ఆమె భర్త శ్రీను ఉంటున్నారు. కొద్ది కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతు న్నాయి. తన భర్తపై ఆమె రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం గ్రా మపెద్దల సమక్షంలో రాజీ చేశారు. ఆమె తన తల్లిని, తొమ్మిదేళ్ల కుమార్తెను దువ్వ నుంచి తన పుట్టింటికి అశ్వారావుపేట దగ్గరలోని నారాయణపురానికి వెళ్లేందుకు బస్సు ఎక్కించి తిరిగి వచ్చింది. భర్త శ్రీనుకు ఏమైందో తెలి యదు.. ఆమె ఇంటికి రాగానే కత్తితో నరికి చంపి పరారయ్యాడు. రూరల్ ఎస్ఐ ఎన్.శ్రీని వాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో పెరవలి మండలం కాపవరంలో జక్కంశెట్టి శ్రీను తన భార్య దానమ్మ (48)పై అనుమానం పెంచుకుని మద్యం మత్తులో విచక్షణ రహితంగా గురువారం కత్తితో నరికి చంపాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా మరో ఇద్దరు అమ్మాయిలకు వివాహాలయ్యాయి. ఎస్ఐ సూర్యభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.