టవర్ ఎక్కిన నాని
తాడేపల్లిగూడెం రూరల్, జనవరి 15 : అత్త మీద కోపంతో ఓ అల్లుడు కరెంట్ స్తంభమెక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేసిన ఘటన పండుగ రోజు గురువారం తాడేపల్లిగూడెంలో జరిగింది. స్థానికంగా కూలి పని చేసుకునే నాని అనే యువకుడికి ఇటీవల వివాహమైంది. సంక్రాంతికి అత్తవారింటికి వెళ్లగా అత్త సరిగా చూడడం లేదని మనస్తాపంతో కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అరగంట సేపు ప్రయత్నించి పోలీసులు కిందకు దింపారు. దీంతో ఆ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు.