బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2021-06-15T05:11:25+05:30 IST

పట్ణణాల్లో, నగరాల్లో పన్నులు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన 196, 197, 198 జీవోలు ప్రజలకు పెనుభారంగా మారనున్నాయి.

బాదుడే బాదుడు

పెను భారంగా మారనున్న పన్నులు

ఆస్తి విలువ ఆధారంగా కొత్త పన్ను 

చెత్తపైనా పన్ను విధింపు.. త్వరలో కుళాయిలకు మీటర్లు 

కరోనా వేళ కొత్త కష్టం తగదు.. నగరవాసుల ఆవేదన


ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూన్‌ 14:

పట్ణణాల్లో, నగరాల్లో పన్నులు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన 196, 197, 198 జీవోలు ప్రజలకు పెనుభారంగా మారనున్నాయి. పన్నులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజ లకు గుది బండలా తయారయ్యే అవకాశాలున్నాయి. ఆస్తి విలువ ఆధారంగా కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తే ఆస్తుల అమ్ముకునే పరి స్థితులు దాపురిస్తాయని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు చెత్తపై పన్ను వేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 నూతన పన్ను విధానం ప్రకారం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. స్థలం విలువ దానిపైన కట్టిన భవ నం విలువ కలిపి పన్నులు నిర్ణయిస్తారు. గతంలో అద్దె విలువ ప్రాతిపదికన పన్నులు నిర్ణయించేవారు. ఒక ఏరియాలో అద్దె ఎంత ఉందో తెలుసుకుని దాని ప్రకారం పన్నులు విధించే వారు. ఇప్పుడు ఆస్తి విలువపై 0.1 శాతం నుంచి 0.5 శాతం వరకు పన్నులు వేస్తారు. అంటే వంద గజాల్లో ఇల్లు ఉంటే స్థలం విలువ రూ.పది లక్షలు, ఇల్లు విలువ రూ.20 లక్షలు అనుకుంటే రూ.30 లక్షల ఆస్తి విలువకు ఏరియాను బట్టి రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు పన్నులు విధించే అవకాశం ఉంది. గతంలో ఒక్కొక్క ఏరియాకు ఒక్కో విఽధంగా పన్ను విధానం ఉండేది. ఇప్పుడు ఇంటింటికీ ఒక పన్ను విధానం అమలులోకి వస్తుం ది. ఆర్‌ఆర్‌ పేట లాంటి ఏరియాలో గజం రూ.50 వేలు ఉంది. ఆ ప్రదేశంలో ఇల్లు ఉన్న వారికి ఇప్పుడు ఉన్న పన్ను కంటే దాదాపు పది రెట్లు పెరిగే అవ కాశం ఉంది. అపార్టుమెంట్లు, కమర్షియల్‌ ఏరియాలోని ఇళ్లు, ఆస్పత్రులు, ప్రభు త్వ కార్యాలయాలు, పరిశ్రమలు వీటన్నింటికి వేర్వేరు పన్ను రేట్లు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే చెత్తపై పన్ను వేసే విధానాన్ని తీసుకొచ్చారు. నగరాన్ని శుభ్రం చేయ డం, మంచినీరు అందించడం, డ్రెయినేజీలు శుభ్రపర్చడం, పారిశుధ్య నిర్వహణ ఇవన్నీ మునిసి పాలిటీల బాధ్యత. కాని ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి మునిసిపాలిటీలను వ్యాపార సంస్థలుగా మార్చివేసింది. రాబోయే రోజుల్లో కుళాయిలకు మీటర్లు బిగించి వాటిపై పన్నులు అధికంగా వేసే అవకాశా నికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.నగరంలో ఆస్తి పన్ను చెల్లించే వారు 43,336 మంది ఉన్నారు. సంవత్స రానికి రూ.24 కోట్ల పన్ను వసూలు అవుతుంది. ఇప్పుడు కొత్త విధానం అమలైతే మొదటి సంవత్సరం రూ.40 కోట్లు పన్ను వసూలు దాటే అవకాశం ఉంది. అదే రెండో సంవత్సరం నుంచి భారీగా పెరిగే అవకాశం ఉంది.   ప్రతి ఏటా స్థలాల విలువలు ప్రభుత్వం పెంచు కుంటూ పోతుంది కాబట్టి పన్నులు పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఉప సంహ రించుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.


 

కరోనా కష్టకాలంలో పన్నులు పెంపా

 సీహెచ్‌ రాజ్యలక్ష్మి, పత్తేబాద, ఏలూరు 

కరోనా కష్టకాలంలోనా పన్నులు పెంచేది. కరోనా వల్ల ఏడాది నుంచి ఉపాధి కోల్పోయి ఆదాయాలు కోల్పోయా రు. నిత్యావసర వస్తు వుల ధరలు ఆకాశాన్నంటుతు న్నాయి. పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నులు పెంచడం తగదు.  


చెత్తపై పన్నా : జి.కోటేశ్వరరావు, వన్‌టౌన్‌, తూర్పువీధి

నగరాన్ని శుభ్రం చేసి చెత్తను తీసుకెళ్లే బాధ్యత మునిసిపాలిటీలదే. అటువంటి చెత్తపై పన్నులు విధించడం దుర్మార్గం. ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించడం సహేతుకం కాదు. పన్నులు పెంచడానికి ఇది సరైన సమయం కాదు. 


కేంద్రం చెప్పినట్టు చేయడం సరికాదు

పి.కిషోర్‌, సీపీఎం నగర కార్యదర్శి 

కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే దానికి రాష్ట్ర ప్రభుత్వం తలూపడం తగదు. మునిసిపల్‌ ఎన్నికలు జరిగే వరకూ పన్నులు పెంచకుండా ఎన్నికలు పూర్తి అయ్యాక పన్నులు బాదడం ప్రజలను మోసం చేయడమే. సంవత్సరం మొత్తానికి ఒకేసారి పన్ను చెల్లించే పద్ధతిని తొలగించాలి. గతంలో వలె ఆరు నెలలకు ఒకసారి పన్నులు విధించాలి 


పన్నులు పెద్దగా పెరిగే అవకాశం లేదు

డి.చంద్రశేఖర్‌, కమిషనర్‌, నగర పాలక  సంస్థ 

కొత్త పన్ను విధానం నగరంలో ఇంతవరకూ అమలులోకి రాలేదు. అమలులోకి వచ్చినా 10 నుంచి 15 శాతం వరకే పన్నులు పెరిగే అవకాశం ఉంది. చెత్తకు పన్ను వసూలు చేయడం లేదు, యూజర్‌ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తాం.

Updated Date - 2021-06-15T05:11:25+05:30 IST