ఉపాధి బకాయిలు చెల్లించండి

ABN , First Publish Date - 2021-08-03T05:44:28+05:30 IST

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బకాయి బి ల్లులు తక్షణం చెల్లించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమ లు చేయడం లేదని తక్షణం బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వ హించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో కిశోర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఉపాధి బకాయిలు చెల్లించండి
ఏలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ నాయకుల ధర్నా

 టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నాలు 

ఏలూరు కలెక్టరేట్‌, ఆగస్టు 2 : ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బకాయి బి ల్లులు తక్షణం చెల్లించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమ లు చేయడం లేదని తక్షణం బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వ హించి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో కిశోర్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ 2019 జూన్‌లో గ్రామాల్లో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా అభివృద్ధి పనులు పూర్తి చేస్తే నేటి వరకూ బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమ న్నారు. తక్షణం వేతన బకాయిలు చెల్లించాలన్నారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్‌, దాసరి ఆంజ నేయులు, పూజారి నిరంజన్‌, పెద్దిబోయిన శివ ప్రసాద్‌, నెర్సు గంగరాజు, వందనాల శ్రీను, బి.బాలాజీ, వేగి ప్రసాద్‌, రెడ్డి నాగరాజు, సోమిశెట్టి రామ మోహనరావు, లక్ష్మణరావు, జిల్లెళ్ళమూడి వరప్రసాద్‌, పలివెల కిషోర్‌, జి.గోపీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

  దెందులూరులో..

దెందులూరు, ఆగస్టు 2: ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు వెంటనే కాంట్రా క్టర్లకు చెల్లించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పటికి ప్రభుత్వం చెల్లింపు చేయకపోవడం అన్యాయమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. దెందులూరులో సోమవారం ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి కూలీలు, టీడీపీ నేతలు, కాంట్రాక్టుదారులతో కరోనా నిబంధనలు పాటిస్తూ నిరసన తెలిపి ఎంపీడీవో లక్ష్మీకి వినతిపత్రాన్ని చింతమనేని, మండల పార్టీ అధ్యక్షుడు మా గంటి నారాయణప్రసాద్‌, గ్రామపార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర రావు, బీసీ సెల్‌ మండలాధ్యక్షుడు నున్న లక్ష్మణ్‌ తదితరులతో కలిసి అందజేశారు. సొసైటీ మాజీ అధ్యక్షుడు బొప్పన సుధా కర్‌, విద్యార్థి విభాగం ఏలూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు పెను బోయిన మహేష్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


డీఆర్వోకు వినతిపత్రం

ఏలూరు టూటౌన్‌, ఆగస్టు 2 : ఉపాధి కూలీల బకాయి వేతనాలు ప్రభుత్వం తక్షణం చెల్లించాలని, వ్యవసాయ రంగంలో యాంత్రీ కరణను నియంత్రించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమ వారం డీఆర్వో డేవిడ్‌ రాజుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాంత్రీకరణ మోజుతో వ్యవసాయ యంత్రాలు ఉపయోగించడం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  యాంత్రీ కరణ ద్వారా భూసారం తగ్గి పోతుందని, సరిగా పంటలు పండవని, చివరకు పశువులకు గట్టి కూడా కరువవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు, కూలీలు ప్రమాదవ శాత్తు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలన్నారు. కరోనా కష్టకాలంలో వ్యవ సాయ పనులు లేక గ్రామీణ పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారన్నారు.  కార్యక్రమంలో కె.లక్ష్మణ రావు, పి.పెంటయ్య, బి.ప్రభాకర్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-03T05:44:28+05:30 IST