Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌కు ఘన నివాళులు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధ్ధంతిని సోమవారం వివిధ సంఘాలు, సంస్థలు, విద్యా సంస్థలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వాన్ని చాటి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.


 ఏలూరు క్రైం, డిసెంబరు 12: అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరూ జీవించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు అన్నారు. ఏలూరు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ వర్ధంతిని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్‌ భవన్‌లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా భీమారావు పాల్గొని మాట్లాడారు. ఏలూరు బార్‌ ప్రధాన కార్యదర్శి మాండ్రు రాజేంద్ర, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల సంఘ నాయకులు రాజబాబు, స్వామి, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

ఏలూరు : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానం, ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జేసీ అంబేడ్కర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి జేసీ పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. జేసీలు సూరజ్‌ గానోరె, పద్మావతి, డీఆర్వో డేవిడ్‌ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

దెందులూరు : శ్రీరామవరం గ్రామ సచివాలయంలో అంబేడ్కర్‌ చిత్రపటా నికి గ్రామ సర్పంచ్‌ కామిరెడ్డి నాని, వైసీపీ గ్రామ అధ్యక్షుడు అక్కినేని శ్రీను, వార్డు సభ్యుడు కామిరెడ్డి బాలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సుమలత, జడ్పీటీసీ లీలానవకాంతం, దెందులూరులో సర్పంచ్‌ ఏసమ్మ, కార్యదర్శి జాషువా, గోపన్న పాలెంలో సర్పంచ్‌ నాగమల్లేశ్వరి, కుమార్‌, కొవ్వలిలో సర్పంచ్‌ మధులత, గంగాధరరావు, సొసైటీ అధ్యక్షుడు సునీల్‌రాజా ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. 

ఏలూరు కార్పొరేషన్‌ : అంబేడ్కర్‌ ఆశయ సాధనే ధ్యేయంగా వ్యవహరి స్తామని జనసేన ఏలూరు నగర ఇన్‌చార్జి రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. జనసేన కార్యాలయం వద్ద అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.  జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఇ.శ్రీనివాస్‌, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్‌, మండల అధ్యక్షుడు వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 65వ వర్ధంతిని సోమవా రం వైసీపీ జిల్లా కార్యాలయంలో శాసనమండలి విప్‌ వి.గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినట్టు వైఎస్సార్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సుధీర్‌ తెలిపారు. రాజ్యాంగ దార్శనికుడు అంబేడ్కర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అశోక్‌కుమార్‌ రెడ్డి, సజ్జల రమణారెడ్డి, రెడ్డిప రెడ్డి, వెంకట నాథ్‌ రెడ్డి, సి.హెచ్‌.సూర్యనారాయణ పాల్గొన్నారు.

 సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాలలో సెట్‌వెల్‌, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సెట్‌వెల్‌ సీఈవో మెహ్రరాజ్‌, ఏవీఆర్‌ విజ్ఞాన కేంద్రం ప్రతినిధి అబ్రహం మాస్టారు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ రాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ ఇమ్మానియేల్‌, శంకర్‌, అధ్యాపకులు కల్యాణి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌ : నగరంలో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 65వ వర్ధంతి కార్యక్రమాలు దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ మే ధావి, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా తెలుగు దేశం పార్టీ పనిచేస్తుందని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధా కృష్ణయ్య (చంటి) అన్నారు. వంగాయగూడెం సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయ కన్వీనర్‌ పాలి ప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు, నగర అధ్యక్షుడు పెద్దిబోయిన శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 జైభీమ్‌ సేవా ట్రస్టు, స్పందన ఉమెన్‌ డవలప్‌మెంట్‌ సొసైటీ చైర్మన్‌ విప్పర్తి ప్రసాదరావు ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి  మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి చాగంటి సంజీవ్‌ పూలమాలలు వేసి నివాళు లర్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనర్‌ డి. చంద్రశేఖర్‌, న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎస్‌.శ్యాంస న్‌రాజు తదితరులు పాల్గొన్నారు. చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పొలిమేర హరికృష్ణ ఆధ్వర్యంలో 44వ డివిజన్‌లో, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనట రింగ్‌ కమిటీ జిల్లా సభ్యుడు మేతర అజయ్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బహుజన రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ కార్యాలయంలో, మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ చాగంటి సంజీవ్‌ ఆధ్వ ర్యంలో కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దళిత సేన జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో, మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ అబ్బూరి అనిల్‌బాబు, నగర అధ్య క్షుడు పెనుమాల ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో, సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యుడు ఓబులేశు అధ్యక్షతన పాతబస్టాండ్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఏలూరు రూరల్‌ : బావిశెట్టివారిపేటలో డాక్టర్‌ భీమ్‌రావ్‌ రాంజీ సమాఖ్య సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి నిర్వహించారు. మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ హాజరై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఏలూరు డిపో కమిటీ ఆధ్వ ర్యంలో ఎంఎఫ్‌ ఉస్మాన్‌బాబా, ఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పీర్టీయూ, బీసీ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  పూల మాలలు వేసి నివాళులర్పించారు.

పెదవేగి : పెదవేగి తహసీల్దారు కార్యాలయంలో డాక్టర్‌ అంబేడ్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సాధన సమితి నాయకుడు యర్రా నాగమల్లేశ్వరరావు, దళిత నాయకులు మద్దుల స్వామిదాసు, కొల్లూరి రామ కృష్ణ, గొట్టేటి స్టాలిన్‌ తదితరులు పాల్గొ న్నారు. 

Advertisement
Advertisement