దండు కదిలింది

ABN , First Publish Date - 2022-01-20T06:21:53+05:30 IST

సంస్థాగతంగా నిలదొక్కుకుని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమయ్యేందుకు తెలుగుదేశం స్పీడు పెంచింది.

దండు కదిలింది
ఏలూరులో టీడీపీ శ్రేణుల ర్యాలీ (ఫైల్‌)

ప్రభుత్వంపై సర్వత్రా పెరుగుతున్న వ్యతిరేకత..

 ప్రజాందోళనలతో జనం మధ్యకు టీడీపీ

 క్షేత్ర స్థాయిలో పెరిగిన మద్దతు.. కేడర్‌లో మిన్నంటిన ఉత్సాహం  

 కన్వీనర్లను పరుగులు పెట్టిస్తున్న అధిష్ఠానం.. 

త్వరలో నిడదవోలు, చింతలపూడిలకు కన్వీనర్లు


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 


సంస్థాగతంగా నిలదొక్కుకుని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతమయ్యేందుకు తెలుగుదేశం స్పీడు పెంచింది. కేడర్‌ను, నేతలను  ప్రజా ఆందోళనలో భాగస్వాములను చేసింది. పార్టీ పిలుపు  మేరకు జరిగే ఆందోళనల్లో ఇప్పటికే నియోజకవర్గ కన్వీనర్లను పరుగులు పెట్టిస్తుండగా, ద్వితీయశ్రేణి కార్యకర్తలు అదేబాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వంపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. అదే సమయంలో గత  మూడు నెలలుగా కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని  అధికార పార్టీ తీరుపై దునుమాడటం పార్టీలో సరికొత్త ట్రెండ్‌.


 నియోజకవర్గాలపై దృష్టి 

జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, పాల్గొం టున్న నేతలు, హాజరవుతున్న కార్యకర్తల సంఖ్య వంటి వివరాలను అధిష్టానం సేకరి స్తోంది. ఎక్కడ బలహీనంగా ఉన్నారో, మరెక్కడ బలంగా ఉన్నారో అంచనా వేస్తోంది. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఆ పార్టీకి వ్యతిరే కంగా ఎవరైనా కామెంట్లు చేయాలనుకు న్నా, నిరసనలు చేపట్టాలన్నా జనం పలుచ గా హాజరయ్యే వారు. రానురాను పార్టీలో వాతావరణం మారింది. ఈ మధ్య కాలంలో ఓటీఎస్‌ దగ్గర నుంచి ధరల పెరుగుదల వరకు జరిగిన ఆందోళనల్లో తెలు గుదేశం కేడర్‌ పెద్ద ఎత్తున పాల్గొంది. మహిళలు, యువ కుల సంఖ్య మెరుగ్గా కనిపించింది. తిరుగులేని ఉత్సాహంతో పార్టీ సీని యర్లు  కేడర్‌ను ముందుండి నడిపించడం ఆరం భించారు. ఏలూరులో కన్వీనర్‌ బడేటి చంటి, తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వ రరావు, పోలవరంలో బొరగం శ్రీనివాస్‌, నరసాపురంలో రామరాజు, తాడేపల్లి గూడెంలో వలవల బాబ్జీ కార్యకర్తల ను పెద్దఎత్తున సమీకరించి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొన సాగించారు. ఊహించనంత సంఖ్యలో కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం. కన్వీనర్లు, సీనియర్‌ నాయకులను ప్రభుత్వం పదే పదే గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నా ఎవరూ ఖాతరు చేయలేదు. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు గన్ని వీరాంజనేయు లు, కె.ఎస్‌.జవహర్‌, సీతారామలక్ష్మి పార్టీ కేడర్‌ను సమన్వ యం చేస్తున్నారు. పార్టీ సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పితాని రాజనీతి ప్రదర్శించి జనసేనతో జతకట్టి అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. దీంతో కేడర్‌లో ఉత్సాహంతోపాటు పార్టీకి మరింత మద్దతు లభించేలా చేసింది. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ప్రస్తుత రాజమహేంద్రవరం పార్లమెంటరీ అధ్యక్షుడు జవహర్‌ అధికార పార్టీని దునుమాడటంలో ముందున్నారు. ఇక్కడ పార్టీని చక్కదిద్దేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. దీంతో పార్టీలో ఊపు వచ్చింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులో తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా తనదైన శైలిలో ముందుకు దూసుకెళుతున్నారు. మరో ఎమ్మెల్యే రామరాజుది అదే పరిస్థితి. ఉండిలో ఆయన పార్టీ కార్యక్రమాలను ఈ మధ్యనే వేగవంతం చేశారు. 


 చింతలపూడి, నిడదవోలు సంగతేంటి ?

నిడదవోలులో పార్టీని ముందుకు నడిపించే వ్యవహారం లో పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతుంది. సీని యర్‌ నేత బూరుగుపల్లి శేషారావు పార్టీ వ్యవహారాలను ముందుకు నడిపించడంపై ఈ మధ్యనే పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో నిస్సహాయత వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా  ఎవరని నియమించాలో ఆరా తీసి ఇద్దరు, ముగ్గురు పేర్లు పరిశీలనకు వెళ్లగా వీరిలో కాస్తంత ఆర్థిక స్తోమత కలిగిన వివాదరహితుడు కుందుల సత్యనారాయణ పేరు అత్యధికులు ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టడానికి పార్టీ ఆహ్వానిస్తే సరేసరి. తనంతట తానుగా వెళ్లేది లేదన్నట్టుగా సత్యనా రాయణ ఉన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్‌ నియామకంపై గడిచిన రెండు నెలల నుంచి అదిగో ఇదిగో  అంటున్నా ఇప్పటికీ చేపట్టలేదు. పార్టీ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, మిగతా నేతలు పర్యవే క్షిస్తున్నారు. ఒక దశలో మురళీకి పార్టీ నియోజకవర్గ సార ధ్య బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై తర్జన భర్జన పడ్డారు. అదే తరుణంలో మాజీ మంత్రి పీతల సుజాత ఈ మధ్యన పలుమార్లు అధినేత చంద్రబాబును కలిశారు. ఇంకోవైపు స్థానిక నేతలతోపాటు మాజీ జడ్పీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు చంద్రబాబును కలుస్తూనే ఉన్నారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన చింతల పూడిలో ఓటర్ల సంఖ్య అధికమే. దీని దృష్ట్యా పార్టీకి ఆర్థిక స్తోమతతో పాటు అత్యంత విధేయుడిని కన్వీనర్‌గా నియ మించాలన్నదే అత్యధికుల అభిప్రాయం. జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో పార్టీ కార్యక్రమాలను ఈ మధ్యనే మరింత వేగవంతం చేశారు. నిడదవోలు, చింతలపూడి నియోజకవర్గాల కన్వీనర్ల నియామకం సాధ్యమైనంత తొందరలోనే జరుగుతుందని సమాచారం.  

Updated Date - 2022-01-20T06:21:53+05:30 IST