44 మందికి హెచ్‌ఎం పదోన్నతులు

ABN , First Publish Date - 2021-10-26T05:17:43+05:30 IST

44 మందికి హెచ్‌ఎం పదోన్నతులు

44 మందికి  హెచ్‌ఎం పదోన్నతులు
హెచ్‌ఎంల కౌన్సెలింగ్‌లో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 25: నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం సోమ వారం గ్రేడ్‌–2 హెచ్‌ఎం వెకెన్సీలకు పదోన్నతి కౌన్సెలింగ్‌ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏలూరు జడ్పీ కార్యాలయంలో ప్రారంభమయింది. మొత్తం 54 వెకెన్సీలు ఉండగా 48 ఖాళీల భర్తీకి మాత్రమే కాకినాడ ఆర్జేడీ అను మతించారు. మరో ఆరు వెకెన్సీల భర్తీపై కోర్టులో కేసులు ఉండడంతో  వాటి ని నిలిపివేశారు. ఈమేరకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా నలుగురు అన్‌విల్లింగ్‌ తెలపగా మిగిలిన 44 మందికి నియామక పత్రాలను జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ అందజేశారు. కౌన్సెలింగ్‌ నిర్వహణలో డీఈవో రేణుక, జడ్పీ సీఈవో, డీఈవో కార్యాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, సూపరింటెండెట్లు పాల్గొన్నారు.


 నేడు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన

పదోన్నతికి అర్హతలు ఉన్న టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ఏలూ రు డీఈవో కార్యాలయంలో జరిగింది. స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీషు సబ్జెక్టు వెకెన్సీలు 53 ఉండగా 72 మంది, బయోలాజికల్‌ సైన్స్‌ 32 వెకెన్సీలకు 116 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కాగా ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్న తికి అర్హుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఒకరోజు ముందుగానే అంటే మంగళ వారం నిర్వహించాలని నిర్ణయించినట్టు డీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.


 కౌన్సెలింగ్‌ పారదర్శకంగా నిర్వహించాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 25: జిల్లాలో టీచర్ల పదోన్నతుల కౌన్సె లింగ్‌లో ఎవరికీ నష్టం జరగకుండా అందరికీ న్యాయం జరిగేలా నిర్వహిం చాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్‌ ఎం.ఎన్‌.శ్రీమన్నా రాయణ, సెక్రటరీ జనరల్‌ ఎం.ఆదినారాయణ డిమాండ్‌ చేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ప్యాప్టో జిల్లా కార్యవర్గ బృందం సోమవారం సాయంత్రం ఏలూరులో డీఈవో సి.వి.రేణుకను మర్యాద పూ ర్వకంగా కలుసుకుని ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిం చారు. గ్రేడ్‌–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఉన్నతా ధికారులతో చర్చించి అందరికీ న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని డీఈవో హామీ ఇచ్చారని వివరించారు. డీఈవోను కలిసిన వారిలో ప్యాప్టో కో–చైర్మ న్లు కె.రామచంద్రరావు, రెడ్డి దొర, కృష్ణ, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్య దర్శి గోపిమూర్తి, హెచ్‌ఎంల సంఘ జిల్లా అధ్యక్షుడు డి.వి.రమణ, డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి తదితరులు ఉన్నారు. 


 పదోన్నతుల జాబితాల్లో గందరగోళం

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 25: జిల్లాలో అన్ని కేడర్లలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను ఈనెల 23వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు జిల్లా విద్యాశాఖ విడుదల చేయలేదని ఏపీటీఎఫ్‌–1938 జిల్లా నాయకులు జి.రాంబాబు, జి.కృష్ణ ఆరోపించారు. పదోన్నతి కౌన్సెలింగ్‌ నిమి త్తం రూపొందించి విడుదల చేసిన జాబితాల్లో రోస్టర్‌ పాయింట్లు లేవని వివరించారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పదోన్నతి జాబితా అసంబద్ధంగా ఉందని, ప్యానల్‌ నెంబర్లు సరిగా లేవన్నారు. పదోన్నతి కౌన్సెలింగ్‌ నిర్వ హించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ ఆ ప్రకా రం రూపొందించిన పదోన్నతి జాబితాలపై అధి కారులు ఇంతవరకు ఆమోదించకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర గందర గోళానికి గురవు తున్నారని తెలిపారు. ఇటువంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా డీఈవో తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-10-26T05:17:43+05:30 IST