మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-24T05:18:53+05:30 IST

మోటారు సైకిళ్లను అప హరిస్తున్న ఒక యువకుడిని ఏలూరు టూటౌన్‌ సీఐ ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, బి.నాగబాబు బృందం అరెస్టు చేశారని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ చెప్పారు.

మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
కేసు వివరాలు తెలుపుతున్న డీఎస్పీ

ఏలూరు క్రైం, అక్టోబరు 23: మోటారు సైకిళ్లను అప హరిస్తున్న ఒక యువకుడిని ఏలూరు టూటౌన్‌ సీఐ  ఆది ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు, బి.నాగబాబు బృందం అరెస్టు చేశారని ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌ చెప్పారు. ఏలూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలను తెలిపారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని బీసీ కాలనీకి చెందిన చింతలపూడి జశ్వంత్‌ (25) వడ్రంగి పనులు చేస్తూ ఉంటాడు. అతనికి ఉన్న మోటారు సైకిల్‌ను ఆర్థిక అవస రాల వల్ల ఒక వ్యక్తి వద్ద రూ. పది వేలకు తాకట్టుపెట్టాడు. ఆ తర్వాత అతనికి మో టారు సైకిల్‌ అవసరమై రెండు నెలల క్రితం ఒక మోటారు సైకిల్‌ను దొంగతనం చేశాడు ఈ విధంగా మొత్తం 14 మోటారు సైకిళ్లను అపహరించాడు. ఈ ఏడాది సెప్టెంబరు 8వ తేదీన ఏలూరు పవర్‌పేటకు చెందిన పద్మనాభుని ప్రణీత్‌ తన ఇంటి వద్ద పెట్టిన మో టారు సైకిల్‌ను అపహరించారంటూ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయ డంతో సీఐ ఆదిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు కిషోర్‌బాబు, నాగబాబు, కానిస్టేబుళ్లు సీత య్య, రాజేష్‌ బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఏలూరు జూట్‌మిల్లు వద్ద అను మానా స్పదంగా వెళ్తున్న జశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను చేసిన నేరాలను అంగీకరించాడు. అతని నుంచి 14 మోటారు సైకిళ్లను స్వాధీ నం చేసుకున్నారు. వీటి విలువ సుమారు ఏడు లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పా రు. దొంగతనా లకు పాల్పడేవారిపై సస్పెక్ట్‌ షీట్లు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీతో పాటు టూటౌన్‌ సీఐ, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:18:53+05:30 IST