కూలి సొమ్ము అందేదెన్నడో..!

ABN , First Publish Date - 2021-08-03T05:49:58+05:30 IST

రెక్కాడితే కాని డొక్కా డని పరిస్థితి కూలీలది.

కూలి సొమ్ము అందేదెన్నడో..!

తొమ్మిది వారాలుగా బకాయిలు

 కుటుంబ పోషణ భారం.. కూలీల ఆవేదన 

 పట్టించుకోని అధికారులు 

ఏలూరు రూరల్‌, ఆగస్టు 2 : రెక్కాడితే కాని డొక్కా డని పరిస్థితి కూలీలది. కూలి పనులు చేసి రెండు నెలలు కావొస్తున్నా ఉపాధి వేతన సొమ్ము అందకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధి హామీ కూలీ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు రూరల్‌ మండలం లో ఐదు వేల మంది కూలీలు పనులను వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఉన్నచోటే కూలీలకు ఉపాధి కల్పించి వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారులు మాత్రం లక్ష్యం చేరుకోవడంపై చూపుతున్న శ్రద్ధ కూలీలకు పనులు కల్పించిన తర్వాత వేత నాలు అందాయా.. లేదా అనే వాటిపై శ్రద్ధ చూపడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. మండలంలో 15 పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆరు వేలకు పైగా జాబ్‌కార్డులు ఉండగా, అందులో 700కు పైగా గ్రూపుల కు ఉపాధి హామీ కూలీలు, కూలి పనులకు వెళ్తున్నట్టు అధికా రిక లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 79 శాతం పనులు నిర్వహించగా అందులో 20 శాతం మెటీరియల్‌ పేమెంట్లు కోసం నిధులు ఖర్చయినట్టు చెబుతున్నారు. మండలంలో పని చేస్తున్న కూలీలకు 9 వారాలుగా కూలీలకు వేదనాలు అందక పోవడంతో కుటుంబాలను పోషించడం కష్టతరంగా మారింద ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.60 లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో కూలీలు ఎక్కు వ శాతం ఉపాధి హామీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి కూలీ సొమ్ము ఖాతాలో జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


 తొమ్మిది వారాలుగా కూలి అందడం లేదు

బి.జోగయ్య, ఉపాధి కూలీ

మూడు నెలల క్రితం ఉపాధి హామీ పథకంలో పని చేసిన 15 – 20 రోజుల్లో కూలి సొమ్ము ఖాతాలో జమ అ య్యేది. ప్రస్తుతం 9 వారాలు అయినప్పటికీ కూలీ సొమ్ము జమ కాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబా లకు పూట గడవడం లేదు. త్వరితగతిన సొమ్ము జమ చేయాలి. 


 ఇబ్బందులు పడుతున్నాం : డి.రంగమ్మ

 కూలీ సొమ్ము సకాలంలో అందిస్తే ఇబ్బందులు ఉండవు. సొమ్ము అందక రెండు నెలలు పైగా కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నెలలు తరబడి పని చేసినా డబ్బు అందకపోవడంతో పూట గడవడం కష్టంగా మారింది. కూలీ సొమ్ము పనిచేసిన వారం రోజుల్లో అందితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధి కారులు స్పందించి కూలీ సొమ్ము చెల్లించాలి.  

Updated Date - 2021-08-03T05:49:58+05:30 IST