జనం ఎక్కువ.. డోసులు తక్కువ

ABN , First Publish Date - 2021-05-06T04:59:07+05:30 IST

కొవిడ్‌ టీకా వేసుకునేందుకు జనం బారులు దీరా రు.

జనం ఎక్కువ.. డోసులు తక్కువ
పన్నెండు పంపుల సెంటర్లో వాక్సిన్‌ వేయించుకోవడానికి గుమిగూడిన జనం

 టీకా కోసం బారులుతీరిన జనం 

 వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద తోపులాట 

ఏలూరు రూరల్‌, మే 5 : కొవిడ్‌ టీకా వేసుకునేందుకు జనం బారులు దీరా రు. అయితే అరకొర స్టాక్‌తో అటు వైద్య సిబ్బంది, ఇటు జనం ఇబ్బంది పడ్డారు. 12 పంపుల సెంటర్‌లో అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లో బుధవారం వ్యాక్సి నేషన్‌ నిర్వహించారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వారంతా ఫస్ట్‌, సెకండ్‌ డోస్‌ టీకా వేసుకున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్‌ కేంద్రానికి తరలి రావడంతో వైద్య సిబ్బంది ముందుగానే స్టాక్‌ తక్కువగా ఉందని చెప్పడంతో జనాల్లో ఆతృత మొదలైంది. టీకా కోసం ఎగబడ్డారు. తోపులాట జరిగింది. దీంతో సిబ్బంది చేసేది లేక క్యూలో వచ్చిన వారికి మాత్రమే టాకీ వేస్తామని చెప్పడంతో అంద రూ వెళ్లి చాలా సేపటికి క్యూలో నిల బడ్డారు. స్టాక్‌ తక్కువగా ఉండి పెద్ద సం ఖ్యలో ప్రజలు తరలి రావడంతో వైద్య సిబ్బంది సతమతమయ్యారు. చాలా మం ది ముఖానికి మాస్క్‌ లేకుండానే క్యూలో నిలబడ్డారు. భౌతిక దూరం ఊసేలేదు.


నగరంలో 14 సెంటర్లలో వ్యాక్సినేషన్‌ 

ఏలూరు టూటౌన్‌, మే 5: నగరంలో 14 సెంటర్లలో బుధవారం వ్యాక్సి నేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు రోజుల నుంచి ప్రజలకు వ్యాక్సి నేషన్‌ అందుబాటులో లేదు. బుధవారం కోవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ కోసం ప్రజలు బారులు తీరారు. కర్ఫ్యూ కారణంగా 12 గంటల నుంచి ఎవరూ వ్యాక్సినేషన్‌ కోసం బయ టకు రాలేదు. 45 ఏళ్లు నిండిన వారికి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో, కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో వ్యాక్సి నేషన్‌ను అందించారు. రెండో డోసు కొవాగ్జిన్‌ కోసం చాలామంది ఎదురు చూశారు. కాని కోవాగ్జిన్‌ అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొదటి డోసు వేయించు కుని నాలుగు వారాలు, ఆరు వారాలు దాటిన వారు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అధి కారులు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతిరోజు వ్యాక్సి నేషన్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ వ్యాక్సిన్‌ లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. 18 ఏళ్లు నిండిన వారు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్నా రు. అయితే వీరికి ఇప్పట్లో వ్యాక్సినేషన్‌ వేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టుగా కనిపిస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినే షన్‌ కోసం  వయసుతో నిమిత్తం లేకుండా పజలు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలతో చాలా మందికి వ్యాక్సినేషన్‌ అందని పరిస్థితి. ఇప్పటికైనా ఒక ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్‌ ఏఏ తేదీల్లో అందిస్తామనేది ప్రజలకు ముందు గానే తెలపాలని ప్రజలు కోరుకుంటున్నారు.  


పెదవేగి మండలంలో 500 మందికి టీకాలు 

పెదవేగి, మే 5: పెదవేగి మండలంలో బుధవారం 500 మందికి కరోనా వైర స్‌ నివారణ టీకాలు వేశారు. కర్ఫ్యూ నేపథ్యంలో ఉదయం ఆరుగంటల నుంచే టీకాలు వేయడం ప్రారంభించారు. పెదవేగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం (పీహెచ్‌సీ)లో 200 మందికి, కొప్పాక ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో 300 మందికి కరోనా నివారణ టీకాలు వేశామని పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ ప్రసన్నకుమార్‌ చెప్పారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల హైదరాబాద్‌ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగురోజుల కిందట తిరిగివచ్చింది. వచ్చిన దగ్గరనుంచి అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్యపరీక్షలు చేయించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.  


కలెక్టరేట్‌లో వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

ఏలూరు, మే 5 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో బుధవారం ఏర్పాటు చేసిన కొవిషీల్డ్‌ వాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ విజ యవంతంగా జరిగింది. వాక్సినేషన్‌ ప్రక్రియను కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జేసీ హిమాన్షు శుక్లా పర్యవేక్షించారు. ఏలూరులోని జర్నలిస్టులు తొలి డోసు వాక్సిన్‌ వేయించుకున్నారు.  


భౌతికదూరం,మాస్క్‌తోనే కరోనా నివారణ 

ఏలూరు రూరల్‌, మే 5 :భౌతిక దూరం, ముఖం మాస్క్‌తోనే కరో నా ఉధృతిని అరికట్టగలమని ఏ లూరు నగరపాలక సంస్థ మాజీ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబా బు అన్నారు. 12 పంపుల సెంటర్‌ లో ఉన్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో బుధవారం నూర్జహాన్‌, ఎస్‌ఎంఆర్‌ పెదబాబు కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కొవిడ్‌ నిబంధనలు పాటిం చాలని, మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఉండాలన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు వీడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2021-05-06T04:59:07+05:30 IST