వరి మాసూళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-15T05:11:01+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు.

వరి మాసూళ్లు ప్రారంభం
నల్లజర్లలో కోత కోస్తున్న యంత్రం

 గిట్టుబాటు ధర లేక రైతుల ఆవేదన 

నల్లజర్ల, ఆక్టోబరు 14 : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. ఈ ఏడాది వరి పంటకు కనీస మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతుల ఆశలు అడియాసలుగా మారాయి. వరి పక్వానికి రావడంతో రైతులు మాసూళ్లు ప్రారంభించారు. బస్తా ధాన్యం కేవలం రూ950కే రైతుల వద్ద నుంచి దళారులు కొనుగొలు చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగొలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో తమ పంటను దళారులకే విక్రయించాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల బస్తా (50 కేజీలు) రూ1200 ఉంటే పండించిన ధాన్యం బస్తా (75కేజీలు) రూ. 950 ఉండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా మూడు వేల హెక్టార్లలో వరి పంట మాసూళ్లు చేసేందుకు సిద్ధంగా ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-10-15T05:11:01+05:30 IST