ఓట్ల లెక్కింపు ఎప్పుడు..?

ABN , First Publish Date - 2021-05-17T05:33:35+05:30 IST

ఏలూరు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్ని కలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎప్పుడెప్పుడా అని బరిలో నిలిచిన అభ్య ర్థులు ఆతృతతో ఉన్నారు.

ఓట్ల లెక్కింపు ఎప్పుడు..?

నగర పాలక  సంస్థ ఎన్నికలు జరిగి  

రెండు నెలలు గడిచినా  లెక్కింపు జరగని ఓట్లు

ఎదురుచూస్తున్న అభ్యర్థులు


ఏలూరు టూటౌన్‌, మే 16 : ఏలూరు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్ని కలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఎప్పుడెప్పుడా అని బరిలో నిలిచిన అభ్య ర్థులు ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై సంవ త్సరం దాటిపోయింది. అంతకు ముందు ఏడాది పైగా ఎదురు చూశారు. వైసీ పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలానికి గత ఏడాది ఫిబ్రవరిలో నగరపాలక మండలి ఏర్పాటుకు ఎన్నికల కమీషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అదే ఏడాది 2020 మార్చి 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా అదేనెల 14న కరోనా కారణంగా ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అప్పటికే ఎన్ని కల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. కరోనా సమయంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం, నగదు తదితర తాయిలాలు పంచి పె ట్టారు. తీరా ఎన్నికలు వాయిదా పడే సరికి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యా రు. మరల సంవత్సరం తర్వాత ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య మార్చి 10వ తేదీన నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించారు. అయితే ఓట్ల లెక్కింపు నిలుపు దల చేయమని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఎన్నికల కౌంటింగ్‌ నిలిచి పోయింది. ఎట్టకేలకు రెండు నెలల అనంతరం ఓట్లు లెక్కించుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వచ్చి పది రోజులు గడిచిపోయింది. అయిన ప్పటికీ ఎన్నికల సంఘం ఇంతవరకూ ఓట్ల లెక్కింపు గురించి మాట్లాడడం లేదు. కరోనా రెండవ సారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ఎమ్మె ల్సీ ఎన్నికలు జరిపేదిలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేప థ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోటీ చేసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఓట్ల లెక్కింపు అనేది కరోనా వైరస్‌ ఉధృతి తగ్గుదల బట్టి ఉం టుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

Updated Date - 2021-05-17T05:33:35+05:30 IST