తగ్గేదేలే..!

ABN , First Publish Date - 2021-12-07T05:01:55+05:30 IST

వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పా ల్సిందేనని వీఆర్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు డిమాండ్‌ చేశారు.

తగ్గేదేలే..!
కలెక్టరేట్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న వీఆర్వోలు

మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాల్సిందే

కొనసాగుతున్న వీఆర్వోల ఆందోళన

తహసీల్దారు కార్యాలయాల్లో విధుల నిర్వహణ


 వీఆర్వోలు చేపట్టిన నిరసన ఐదు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో మంత్రి అప్పలరాజు, మునిసిపల్‌ కమిషనర్‌ వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీఆర్వోలు నిరసనలకు దిగారు. గ్రామ సచివాలయాల్లో కాకుండా తహసీల్దార్‌ కార్యాలయాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం సూచించిన విధులను నిబద్ధతతో నిర్వహిస్తున్నామని, అలాంటి తమపై చిన్నచూపు చూస్తూ అనుచితంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  మంత్రి క్షమాపణ చెప్పేవరకు వెనక్కి తగ్గేది లేదంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే మరోవైపు వీరి నిరసనతో సామాన్య జనం  సేవలు సక్రమంగా  అందక ఇబ్బందులు పడుతున్నారు.


ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 6: వీఆర్వోలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పా ల్సిందేనని వీఆర్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రరాజు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళంలో జరిగిన సమా వేశంలోమంత్రి అప్పలరాజు, మునిసిపల్‌ కమిషనర్‌  వీఆర్వోల పట్ల చులకనగా ప్రవర్తించిన తీరును నిరసిస్తూ సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతి అందించేం దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని కొందరిని మాత్రమే అనుమతించారు.  ఈ మేరకు ఆర్డీవో పనబాక రచనను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి రాంబాబు, ఏలూరు డివిజన్‌ అధ్యక్షుడు సాయల వెంకటే శ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, 16 మండలాలకు సంబంధించి వీఆర్వోలు పాల్గొన్నారు.

పెదవేగి : రాష్ట్రమంత్రి సిదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్య లతో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వోలు) చేపట్టిన ఆందోళన సామాన్య ప్రజలను ఇక్కట్ల పాల్జేస్తోంది. ఐదురోజులుగా వీఆర్వోలు నల్లరిబ్బన్లను ధరించి గ్రామ సచివాలయాలను వీడి, తహసీల్దారు కార్యాలయంలో విధులను నిర్వహిస్తు న్నారు. దీంతో గ్రామాల్లో వీఆర్వోల సేవలు అందుబాటులో లేకుండా పోయా యి. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగుతుందని వీఆర్వోల సంఘం పెదవేగి మండల అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌  తెలిపారు. 

పెదపాడు : ఈనెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న వీఆర్వోలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సచివాలయ విధులను బహిష్కరించి తహసీల్దారు కార్యాలయం వద్ద విధులను చేపడుతున్నట్టు వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు బేవర కోటేశ్వరరావు తెలిపారు. తహసీల్దారు కార్యాలయా నికి విధులు చేపట్టడానికి వచ్చిన వీఆర్వోలు సోమవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వోలు రాంబాబు, నటరాజన్‌దాస్‌, మురళి, అజయ్‌, వెంకటేశ్వరరావు, షేక్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:01:55+05:30 IST