అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-28T05:00:14+05:30 IST

అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జడ్పీ సీఈవో హరిహరనాథ్‌ సూచించారు.

అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
మాట్లాడుతున్న జడ్పీ సీఈవో హరిహరనాథ్‌

జడ్పీ సీఈవో హరి హరనాథ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, అక్టోబరు 27 : అర్హులైన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జడ్పీ సీఈవో హరిహరనాథ్‌ సూచించారు. నవం బరు ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఓటర్ల జాబి తా ప్రత్యేక సంక్షుప్త సవరణ కార్యక్రమాన్ని పుర స్కరించుకుని బుధవారం సెయింట్‌ థెరిస్సా మ హళా డిగ్రీ కళాశాల విద్యార్థినులకు ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ సీఈవో మాట్లా డుతూ వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు వచ్చే వారంతా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవచ్చన్నారు. దీంతోపాటు ఓటర్ల జాబితాలో చిరునామా, పేర్లలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించినట్టు వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, తహ సీల్దార్‌ సోమశేఖర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విద్యా సాగర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మరియట్టా డిమెల్లో పాల్గొన్నారు.


పెదపాడు: స్త్రీ, పురుషులెవ్వరైనా సరే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేందుకు అర్హులని, ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను వినియోగించు కుని ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దారు ఎం.ఇందిరా గాంధీ తె లిపారు. కళాశాల విద్యార్థులకు ఓటుహక్కు వినియోగం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని వట్లూరులోని సీఆర్‌రెడ్డి ఇంజనీ రింగ్‌ కళాశాలలో బుధవారం ని ర్వహించారు. తహసీల్దారు మా ట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ మొబైల్‌లో ప్రత్యేక యాప్‌ ద్వారా ఓటరుగా నమో దు కావాలన్నారు.  నియోజకవర్గ ఎన్నికల అవగాహన అధికారి గాయత్రి, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:00:14+05:30 IST