Abn logo
Oct 18 2021 @ 23:39PM

ఫుట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపు ప్రారంభం

ఎంపికైన క్రీడాకారులు

ఏలూరు స్పోర్ట్స్‌, అక్టోబరు 18: జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యం లో సోమవారం ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఫుట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంపు ప్రారంభించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.ఆలీబాబా కోచింగ్‌ క్యాంపును ప్రారంభించి ప్రసంగించారు. ఇటీవల దేవరపల్లిలో క్రీడా కారులను ఎంపిక చేసినట్టు తెలిపారు. వీరందరికీ శిక్షణ ఇచ్చి త్వరలో జరగబోయే స్టేట్‌ మీట్‌కు పంపిస్తార న్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ ఎస్‌ఏ అజీజ్‌, కార్యదర్శి ఆర్‌.నాగేశ్వరరావు, ఫుట్‌బాల్‌ కోచ్‌ సురేంద్ర, అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.