భవానీ దీక్ష విరమించి వస్తూ మృత్యుఒడికి..

ABN , First Publish Date - 2021-10-17T05:05:31+05:30 IST

విద్యార్థులైన వారిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్ష (భవానీ మాల) వేసుకున్నారు.

భవానీ దీక్ష విరమించి వస్తూ మృత్యుఒడికి..
మృతిచెందిన కృష్ణవంశీ

 లారీని వెనుక నుంచి ఢీకొట్టిన మోటార్‌ సైకిల్‌

ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఏలూరు క్రైం, అక్టోబరు 16 : విద్యార్థులైన వారిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్ష (భవానీ మాల) వేసుకున్నారు. విజయవాడ లో కొండపై కొలువై ఉన్న కనక దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమించి తిరిగి ఇంటికి మోటారు సైకిల్‌పై పయనమయ్యారు. మార్గమధ్యలో లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొం దుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కంభాల చెరువు ప్రాంతానికి చెందిన కందిరెల్లి కృష్ణవంశీ (22) డిగ్రీ చదువు తున్నాడు. అతని స్నేహితుడు మరడా పార్థు (19) డిగ్రీలో చేరాడు. వీరిద్దరూ భవానీ దీక్ష తీసుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమిం చేందుకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి నుంచి హోండా యాక్టివ్‌ మోటారు సైకిల్‌పై విజయవాడ వచ్చారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో  అమ్మవారి గుడిలో దీక్ష విరమించారు. అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరారు. 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై మార్గమధ్య లో కృష్ణాజిల్లా వీరవెల్లి దాటిన తర్వాత హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని ఇండి యన్‌ ఆయిల్‌ పెట్రోలు బంక్‌ వద్ద ముందు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్‌ అకస్మా త్తుగా బ్రేక్‌ వేశాడు. దాని వెనుకనే వెళ్తున్న మోటారు సైకిల్‌ నడుపుతున్న కృష్ణవంశీ అదుపు చేయలేక ఆ లారీని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో స్నేహితు లిద్దరూ తీవ్రంగా గాయపడగా తొలుత పశ్చిమగోదారి జిల్లా ఏలూరు ప్రభుత్వా స్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగపు వైద్యులు పరీక్షించి కృష్ణ వంశీ మృతి చెందాడని నిర్ధారించారు. పార్థును ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్ప త్రికి తరలించారు. ఈ ఘటనపై ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసి ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు కృష్ణవంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించా రు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కృష్ణవంశీ తొలిసారిగా భవానీ దీక్ష తీసుకున్నాడు. అతని మృతితో కుటుం బ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 



Updated Date - 2021-10-17T05:05:31+05:30 IST