మళ్లీ ‘ఎయిడెడ్‌’ వివాదం

ABN , First Publish Date - 2022-01-24T04:14:10+05:30 IST

ప్రభుత్వంలోకి ఎయిడెడ్‌ కళాశాల అధ్యాప కులు విలీనం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

మళ్లీ ‘ఎయిడెడ్‌’ వివాదం

సీఆర్‌ఆర్‌ను ఎయిడెడ్‌ కళాశాలగానే కొనసాగించేలా లేఖ ఇవ్వాలని డిమాండ్‌
 ఉద్యమ బాటకు ఎస్‌ఎఫ్‌ఐ అల్టిమేటం

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 23: ప్రభుత్వంలోకి ఎయిడెడ్‌ కళాశాల అధ్యాప కులు విలీనం, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏలూరు   సీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల యాజమాన్యం తొలుత గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, అధ్యాప కుల అప్పగింతపై ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటూ, ఆ మేరకు కొత్తగా ఇచ్చిన వెసులుబాటు ప్రకారం ఆప్షన్‌–4ను అనుసరించి ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌కు కళాశాల యాజమాన్యం తాజాగా లేఖను పంపకపోవ డంపై విద్యార్థి సంఘాలు ధ్వజమెత్తాయి. ఆదివారం ఏలూరులో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 60 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రభుత్వానికి లేఖలు ఇచ్చి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లోనే కళాశాలలను కొనసాగిస్తామని కమిషనర్‌కు చెప్పగా ఆ మేరకు అధ్యాపకులను సంబంధిత కళాశాలలకు వెనక్కి పంపించి వేశారన్నా రు. దీనికి భిన్నంగా ఏలూరు సీఆర్‌ఆర్‌ కళాశాల ఒక్కటి మాత్రమే ప్రైవేటు కళాశాలగా నిర్వహిస్తుండడాన్ని గమనిస్తే కళాశాల ఆస్తులను కార్పొరేట్‌ శక్తుల చేతిలో పెట్టాలని యాజమాన్యం చూస్తున్నట్టుగా అనుమానించాల్సి వస్తోందన్నా రు. భీమవరం, పెనుగొండ, నరసాపురం, కొవ్వూరులలోని ఐదు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఎయిడెడ్‌లోనే కొనసాగడానికి లేఖలు అందజేయ గా, ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే క్రమంలో సీఆర్‌ఆర్‌ కళాశాలను కూడా ఎయిడెడ్‌గానే నిర్వహిస్తామని విద్యా సంస్థల కార్య దర్శి గతంలో బహిరంగంగా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రైవేటుగా కొనసాగించాలనే ఆలోచనను విరమించుకుని ఎయిడెడ్‌గా నడిపేందుకు అవస రమైన లేఖను ఉన్నత విద్యాకమిషనర్‌కు యాజమాన్యం ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రెడ్డి గౌరీ శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మణి, ఎల్‌.రాజేష్‌, నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T04:14:10+05:30 IST