భయో.. మెట్రిక్‌

ABN , First Publish Date - 2021-10-26T05:20:08+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇకపై బయోమెట్రిక్‌ హాజరు వేస్తేనే జీతాలు చెల్లిస్తామని ఆ శాఖ తరపున ఉత్తర్వులు జారీ చేశారు.

భయో.. మెట్రిక్‌

బయోమెట్రిక్‌ వేస్తేనే జీతాలు.. డీడీవోలకు మార్గదర్శకాలు 

సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన 

ఏలూరు రూరల్‌, అక్టోబరు 25 : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇకపై బయోమెట్రిక్‌ హాజరు వేస్తేనే జీతాలు చెల్లిస్తామని ఆ శాఖ తరపున ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరుకు సంబంధించి సిబ్బంది ఎన్ని రోజులు బయోమెట్రిక్‌ హాజరు వేశారో అన్ని రోజులకే జీతాలు చెల్లించాలని సంబంధిత డీడీవోలకు మార్గదర్శకాలు అందాయి. చాలా సచివాలయాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదని ఈ పరిస్థితిలో బయోమెట్రిక్‌ హాజరు కోసం సిగ్నల్స్‌ వచ్చే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. మండలంలో 28 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. 673 మంది వలంటీర్లు ఉండగా 243 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే సరైన సౌకర్యాలు లేక సచివాలయ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో చాలా సచివాలయాలు భవన నిర్మా ణాలు పూర్తికాకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్న తరుణంలో బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నాం. నిరుద్యో గుల జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాం.. అంటూ రెండేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ చూసి నిరుద్యోగులు సంబరపడ్డారు. ఉన్న కొలువులు వదులుకుని సర్కారు కొలువుకు సన్నద్దమయ్యారు. బయోమెట్రిక్‌ కారణం చూ పుతూ తాజాగా ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించడం, బయోమెట్రిక్‌ తప్పని సరి చేయడం వారిని కలవర పెడుతోంది. 


సంక్షేమ పథకాలకు కోత 

సచివాలయ ఉద్యోగానికి ఎంపిక కాకముందు ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుని ఇంతకు రెండు రెట్లు ఎక్కువ జీతం తీసుకున్న వారు ఉన్నారు. పర్మినెంట్‌ కాక ముందే ఉద్యోగుల తల్లిదండ్రులు, వృద్ధాప్య, పెన్షన్‌, రేషన్‌కార్డులతో పాటు సంక్షే మ పథకాలకు అర్హత లేకుండా చేశారు. రెండేళ్లు పూర్తియిన వెంటనే పర్మినెంట్‌ ఉద్యోగులుగా మారుస్తామని చెప్పి ఇప్పుడు పర్మినెంట్‌ చేసేందుకు పరీక్షలు పెట్టారు. ఇంతలోనే బయోమెట్రిక్‌ కారణం చూపి వేతనంలో కోత విధించాలని ప్రతి సిబ్బంది బయోమెట్రిక్‌ తప్పనిసరి చేయడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో సచివాలయ ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.  

Updated Date - 2021-10-26T05:20:08+05:30 IST