కరోనా పరీక్షలకు పరుగులు

ABN , First Publish Date - 2021-05-16T05:30:00+05:30 IST

కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వచ్చిందంటే ఆ కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నారు.

కరోనా పరీక్షలకు పరుగులు
వర్షంలో సైతం కొవిడ్‌ టెస్టుల కోసం ఉన్న ప్రజలు

ఏలూరు క్రైం, మే 16: కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా వచ్చిందంటే ఆ కుటుంబం అంతా తల్లడిల్లిపోతున్నారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య  స్థితి గతులను బట్టి ఏ ఆస్పత్రిలో చేర్పించాలో ఎలా వైద్యం చేయించాలో ఆందోళనకు గురవుతున్నారు. మిగిలిన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటనే దానిపై కూడా వారు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష కోసం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఆదివారం ఓ మోస్తరు వర్షం కురు స్తున్న వారు క్యూలైన్‌ తప్పకుండా వర్షంలోనే ఉండి కరోనా నిర్ధారణ పరీ క్షలు చేయించుకున్నారు. ఆస్పత్రిలో ఆర్‌టీపీసీఆర్‌ కాకుండా రాపిడ్‌ టెస్టులు నిర్వహించడం వల్ల వారి ఆందోళన కొంతమేర తగ్గినట్టు అయింది. ఆర్‌టీపీ సీఆర్‌ పరీక్ష అయితే మూడు రోజుల నుంచి వారం రోజుల సమయం ఫలి తాలు రావడానికి పడుతుంది. కాని రాపిట్‌ టెస్టు వెంటనే పది నిము షాల్లోనే ఫలితాలు వెల్లడించడంతో తెలుసుకున్న వారు తమ టెన్షన్‌ను తగ్గించుకుంటున్నారు. ఫలితం నెగెటివ్‌ వస్తే హమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకుంటున్నారు. 

Updated Date - 2021-05-16T05:30:00+05:30 IST