కర్ఫ్యూ నీడలో..

ABN , First Publish Date - 2021-05-06T05:06:32+05:30 IST

జిల్లా లో మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు 18 గంటల పాటు కర్ఫ్యూ విధించడంతో ఏలూరు కర్ఫ్యూ నీడలో ఉం ది.

కర్ఫ్యూ నీడలో..
నిర్మానుష్యంగా ఉన్న ఆర్‌ఆర్‌ పేట

నిర్మానుష్యంగా రహదారులు

స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత

నగరంలో తగ్గిన జనం రద్దీ


ఏలూరు సిటీ/ఏలూరు రూరల్‌, మే 5: జిల్లా లో మధ్యాహ్నం 12 గంటల నుంచి తెల్లవారు ఝామున 6 గంటల వరకు 18 గంటల పాటు కర్ఫ్యూ విధించడంతో ఏలూరు కర్ఫ్యూ నీడలో ఉం ది. ఈ మేరకు బుధవారం నగరంలో కర్ఫ్యూ నూరు శాతం విజయవంతం అయింది. రోడ్లపై  జన సంచారం లేకపోవడంతో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారా యి. వన్‌టౌన్‌, టూటౌన్‌ ప్రాంతాల్లో షాపులన్నీ మూసివేసి వ్యాపారు లు సహకరించారు. బంగారం షాపులు, హోల్‌సేల్‌ దుకాణాలు మూసివేశారు. హోటళ్ళు బంద్‌ చేసి ఆంక్షలకు సహకరించారు. ప్రజలు రహదారుల పైకి రావ డానికి సాహసించలేదు. అయినా కొన్ని ప్రాంతాల్లో  కొంతమంది మధ్యాహ్నం 12 గంటలు దాటినా రహదారుల పైన సంచరిస్తుండగా వారికి పోలీసులు కౌన్సె లింగ్‌ ఇచ్చారు. ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో బారికేట్లు ఏర్పాటు చేశారు. ఆర్‌ఆర్‌పేట, పవర్‌ పేట, పాతబస్టాండ్‌ సెంబర్‌, వన్‌టౌన్‌లో మెయిన్‌ బజా రులలో జన సంచారం తగ్గింది. కొత్త బస్టాండ్‌, పాతబస్టాండ్‌లో ప్రయాణికులు  కనిపించలేదు. 12 గంటలలోపు కొన్ని బస్‌ సర్వీసులు తిరిగినా జనం మాత్రం స్వల్పంగానే కనిపించారు. ఉదయం 6గంటల నుంచి 12 గంటల వరకు మాత్రం వాణిజ్య సంస్థలు రద్దీగానే కనిపించాయి. అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వడంతో బ్యాంకు ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కార్యాయాలకు వెళ్లి తిరిగి వస్తూ కొంత ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆస్పత్రులకు వెళ్లే వారిని మాత్రం పోలీసులు అనుమతించారు. కరోనా విజృంభి స్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూకు సహకరించారు. కర్ఫ్యూ కారణం గా చిరువ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.  


పెదవేగి మండలంలో..

పెదవేగి, మే 5: కొవిడ్‌ మహమ్మారి రెండోదశలో వేగంగా విస్తరిస్తోందని, ఈ సమయంలో ప్రజలు ఎవ్వరికివారు స్వీయ రక్షణలు పాటించాలని పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ చెప్పారు. అప్పుడే కరోనా వైరస్‌నుంచి విముక్తి లభిస్తుందన్నారు. మండలంలో పలుగ్రామాల్లో ఆయన బుధవారం విస్తృతంగా పర్యటించి కర్ప్యూ పరిస్థితిని పర్యవేక్షించారు. విజయరాయిలో కర్ఫ్యూ సమయంలో రహదారిపై సంచరిస్తున్న ప్రజలను గుర్తించి, మరోసారి ఎటువంటి కారణం లేకుండా రహదారులపై ఇష్టానుసారం తిరిగితే కేసులు నమోదు చేయడంతో పా టు వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. కాగా కర్ఫ్యూ కారణంగా ప్ర జలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులు బోసిబోయాయి.


దెందులూరు మండలంలో..

దెందులూరు, మే 5: దెందులూరు మండలంలోని అన్ని గ్రామా ల్లో బుధవారం పోలీసులు అన్ని  కర్ఫ్యూ అమలు చేశారు.  గోపన్నపాలెం, సోమవరప్పాడు, దెందులూరు, గుండుగొలను గ్రామాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. భీమడోలు సీఐ సుబ్బారావు, దెందులూరు ఎస్‌ఐ రాంకుమార్‌ కర్ఫ్యూ అమ లును పరిశీలించారు. వారు మాట్లాడుతూ అత్యవసర సేవ లు అందించేవారు, అనుమతి ఉన్నవారు తప్పనిసరిగా అనుమతి పత్రం వెంట ఉంచుకోవాలని సూచించారు.


 పెదపాడు మండలంలో..

పెదపాడు, మే 5 : రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 వరకు విధించిన కర్ఫ్యూ దృష్ట్యా అంతా నిబంధన లను కచ్చితంగా పాటించాలని ఎస్‌ఐ జ్యోతిబస్‌ తెలిపారు. కర్ఫ్యూ వేళల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, అనుమతించిన, అత్యవసర సేవలు మినహా మరె వ్వరూ బయటకు రాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పెదపాడు, అప్పనవీడు, కలపర్రు ముఖ్యకూడళ్ల వద్ద ఏఎస్‌ఐ అర్జునరావు ఆధ్వర్యంలో దుకాణాలు మూయించి వేశారు. 



డిశ్చార్జి బాధితులకు వాహనాల ఏర్పాటు

ఏలూరు క్రైం, మే 5 : ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో డిశ్చార్జి అయిన బాధితులు ఇళ్లకు వెళ్లడానికి వాహనాలు లేని పరిస్థితి. ఎవరిని అడిగినా కర్ఫ్యూ సమయం అని తాము రాలేమంటూ ఆటోలు, కార్లు లేవని చెప్పడంతో ఏమీ చేయలేక ఆస్పత్రి ఆవరణలోనే బాధితులు కూర్చుని ఉన్నారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిని పరిశీలించడానికి వచ్చిన ఏలూరు టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌ పరిస్థితిని గమనించి ఆస్పత్రి బయట ఉన్న ఆటో స్టాండ్‌ డ్రైవర్లను పిలిపించి పంపించా రు. ఎక్కువ మంది ఉండడంతో ఏలూరు ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావుకు సమాచారం అందించి ఆటోలు పంపించాలని సూచించడంతో ఏలూరు కొత్త బస్టాండ్‌ నుంచి పది ఆటోలు పైగా పంపించడంతో వారిని ఇళ్లకు తరలించారు.

Updated Date - 2021-05-06T05:06:32+05:30 IST