ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం

ABN , First Publish Date - 2021-03-04T05:29:57+05:30 IST

‘అధికారం ఉంది కదా అని దౌర్జన్యా లు చేయడం కాదు. ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం.. కార్పొరేటర్‌ అభ్యర్థు లుగా నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యంగా వైసీపీలోకి లాక్కోవడం సిగ్గుచేటు.. మంత్రి అనుచరులు టీడీ పీ అభ్యర్థులు భయపెట్టి ఉపసంహరించుకునేలా చేయడం దుర్మార్గమైన చర్య’ అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం
మునిసిపల్‌ కార్యాలయం గేటు వద్ద దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌

 దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, మార్చి 3 : ‘అధికారం ఉంది కదా అని దౌర్జన్యా లు చేయడం కాదు. ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందాం.. కార్పొరేటర్‌ అభ్యర్థు లుగా నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులను బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యంగా వైసీపీలోకి లాక్కోవడం సిగ్గుచేటు.. మంత్రి అనుచరులు టీడీ పీ అభ్యర్థులు భయపెట్టి ఉపసంహరించుకునేలా చేయడం దుర్మార్గమైన చర్య’ అంటూ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ కార్యాల యాని కి బుధవారం టీడీపీ అభ్యర్థులతో పాటు వచ్చి నామినేషన్ల ఉపసంహణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులను  చూసి ప్రజలకు అసహ్య భావం ఏర్పడుతోందన్నారు. వీరి చర్యల వల్ల అసలు రాజకీయ నాయకులంటే ప్రజల్లో చులకన భావం ఏర్పడిందన్నారు. సంతలో పశువుల్లా టీడీపీ అభ్యర్థులను కొనుగోలు చేస్తూ నీతి మాలిన చర్యకు పాల్పడుతున్నారన్నారు. కన్న తల్లిలాంటి పార్టీ మ్యాండేట్‌ తీసుకుని అనంతరం వెళ్లి వైసీపీలో చేరడం నీతిమాలిన చర్య అన్నారు. ఓటర్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా డబ్బులు కోసం అమ్ముడుపోతున్న వారిపై ప్రజల్లో ఏహ్య భావం ఏర్పడుతోంద న్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టిన ప్పటికీ టీడీపీని వీడి వైసీపీలో రానని మొండికేసిన అభ్యర్థులపై దౌర్జన్యాలు చేయడం, ఇళ్లను కూలగొట్టడం వంటి చర్యలతో బెదిరిస్తూ బలవంతంగా  పార్టీలో చేర్చుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమ నేనితో పాటు అభ్యర్థులు కడియాల విజయలక్ష్మి, దాసరి ఆంజనేయులు, బండి వెంకటేశ్వరరావు, గవ్వా మధు సూదనరావు ఉన్నారు.

Updated Date - 2021-03-04T05:29:57+05:30 IST