బెడ్లు ఖాళీ లేవు

ABN , First Publish Date - 2021-05-06T05:53:13+05:30 IST

ఏలూరులోని పెద్దాసుప త్రిని నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవాలని వస్తే అక్కడ కనీసం చూసే నాధుడే కరువయ్యారు.

బెడ్లు ఖాళీ లేవు
ఏలూరు ఆసుపత్రి వద్ద అంబులెన్స్‌లో బాధితులు

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవరణలో బాధితుల వెయుటింగ్‌

ఆక్సిజన్‌ సిలిండర్‌తో ఆరు బయట ఊపిరి పీల్చుకుంటున్నారు

వైద్యమందడం లేదని వైరల్‌.. 

ఆరోగ్య మంత్రి నాని స్పందన

కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌


ఏలూరు క్రైం, మే 5 : ఏలూరులోని పెద్దాసుప త్రిని నమ్ముకుని ప్రాణాలు కాపాడుకోవాలని వస్తే అక్కడ కనీసం చూసే నాధుడే కరువయ్యారు. కనీ సం లోపలికి తీసుకువెళ్లి శాచ్యురేషన్‌ (ఆక్సిజన్‌ లె వెల్స్‌) చూసే వారు లేరు. ఎన్నిసార్లు బతిమాలు కున్నా అక్కడ వున్న ఎంఎన్‌వోలు తమకు ఏమీ వినపడనట్లు వ్యవహరించడం, ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు అంటూ వెళ్లిపోండి అంటూ సెక్యూరిటీ గార్డు లు చెప్పేస్తున్నారు. ఆసుపత్రి కొవిడ్‌ అత్యవసర విభాగం ముందే కరోనా బాధితులు అంబులెన్సు ల్లోనూ, ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకుని బల్లలపై కూర్చుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఈ దృశ్యాలు బుధవారం కనిపించాయి. స్థానిక ప్రభు త్వాసుపత్రిలో 300 పడకలను కొవిడ్‌కు కేటాయిం చారు. బాధితులతో ఆసుపత్రి నిండిపోయింది. ఈ మేరకు ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటుచేశారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలని, తమ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని కొవిడ్‌ బాధితులు అంబు లెన్సుల్లో, వివిధ వాహనాల్లో రాగా వాళ్లను పరీక్ష లు చేయకుండానే ఇక్కడ బెడ్లు ఖాళీ లేవు వెళ్లి పోండి అంటూ చెప్పేస్తున్నారు. ఒక్కసారి డాక్టర్‌ గారికి చూపించండంటూ అడిగినా అక్కడ ఉన్న ఎంఎన్‌వోలు  పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోయారు. ఈ విషయం సోషల్‌ మీడి యాలో బుధవారం వైరల్‌ కావడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే సీరియస్‌ అయ్యారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌కు ఫోన్‌ చేసి ఆసుపత్రి పరిస్థితిపై ఆరా తీశారు. అప్పటి కప్పుడే అదనంగా మరో 38 బెడ్లను అత్యవసరంగా ఏర్పాటు చేయించారు. ఏ బాధితుడు వచ్చినా తక్ష ణం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చే కరోనా బాధితులకు మెరు గైన వైద్య సేవలందే విధంగా పర్యవేక్షణకు కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కు మార్‌రెడ్డిని నియమించారు. దీంతో ఆయన ఆసుప త్రికి వచ్చి అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఎక్కడైనా నిర్లక్ష్యం జరి గితే సహించేది లేదంటూ సిబ్బందిని హెచ్చరిం చారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ పీఏఆర్‌ఎస్‌ శ్రీనివాస్‌ను ఆసుపత్రి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కరో నా బాధితులకు ఆలస్యం చేయకుండా వెంటనే వై ద్య సేవలందేలా సిబ్బందిని నియమించాలన్నారు.


Updated Date - 2021-05-06T05:53:13+05:30 IST