రాజీనామా చేసిన స్టాఫ్‌ నర్సులకు జీతాలా..!

ABN , First Publish Date - 2021-02-25T04:55:20+05:30 IST

ఉద్యోగ సిబ్బంది నిర్వహణ, జీత భత్యాల చెల్లింపుల్లో డీఎంహెచ్‌వో కార్యాలయ వైఫల్యం ఒకటి వెలుగులోకి వచ్చింది.

రాజీనామా చేసిన స్టాఫ్‌ నర్సులకు జీతాలా..!

ఏలూరుఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 24: ఉద్యోగ సిబ్బంది నిర్వహణ, జీత భత్యాల చెల్లింపుల్లో డీఎంహెచ్‌వో కార్యాలయ వైఫల్యం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉద్యోగ సంఘ నేతలు ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో కార్యాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. జీవో 60 ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది జనవరిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్‌ నర్సు ఉద్యోగ నియామకాల భర్తీ జరిగింది. ఏడాది కాల పరిమితికి లోబడి చేపట్టిన 82 స్టాఫ్‌ నర్సు కాంట్రాక్టు నియామకాల్లో ఎనిమిది పోస్టులు అభ్య ర్థులు లేక మిగిలిపోయాయి. ఇలా కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారిలో ఆరుగురికి వేరే పోస్టులు రావడంతో స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల్లో చేరకుండానే రాజీనామా చేశారు. మిగతా వారికి మాత్రమే జీతభత్యాలు చెల్లించాల్సి ఉం డగా రాజీనామా చేసిన వారి పేర్లను సైతం పేర్కొంటూ జీతాల చెల్లింపు నకు డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారుల నుంచి ఖజానా శాఖకు లేఖను పంపారు. దీనిపై సమాచారం అందుకున్న ఉద్యోగ సంఘాల నేతలు బుధ వారం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి రాజీనామా చేసిన ఉద్యోగుల పేర్లను జీతభత్యాల బిల్లులో ఎలా చేరుస్తారంటూ ప్రశ్నించారు. రాజీనామా లతో ఖాళీ అయిన పోస్టులకు, మిగిలి పోయిన క్లియర్‌ వేకెన్సీలకు మళ్లీ నియామకాలు చేపట్టాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-02-25T04:55:20+05:30 IST