Abn logo
Nov 22 2020 @ 06:29AM

అనుమానం పెనుభూతమై..

భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త


మరిపెడ రూరల్‌(చిన్నగూడూరు). నవంబరు 21: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యను భర్త క్షణికావేశంలో కర్రతో మోదటంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మరిపెడ మండలంలోని చిల్లంచర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూడపక సైదులు తన భార్య దూడపాక జ్యోతి(30)పై అనుమానం పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి ఇద్దరి మద్య వాగ్వావాదం చోటుచేసుకోవటంతో సైదులు కోపోద్రికుడై జ్యోతిని కర్రతో తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలానికి నర్సింహులపేట, మరిపెడ, చిన్నగూడూరు ఎస్సైలు చేరుకుని ఉద్రిక్తతలు తలెత్తెకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ఏరియ అస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement