సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

ABN , First Publish Date - 2020-11-25T08:26:06+05:30 IST

రాష్ట్రంలో లాండ్రి షాపులు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రజక సంఘం...

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు

జనగామ టౌన్‌, నవంబరు 24: రాష్ట్రంలో లాండ్రి షాపులు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయం నాయీ బ్రాహ్మణులకు వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కన్వీనర్‌ కొత్తపలి ్ల వెంకటేశ్‌, నాయకులు లింగాల సత్యం, అవినాష్‌, ప్రభాకర్‌, శ్రీరాములు, ఆనంద్‌, ఈశ్వర్‌, అశోక్‌ పాల్గొన్నారు.


రజక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఉల్లెంగుల కృష్ణ, సత్యనారాయణ, సారయ్య, శేఖర్‌, యాదగిరి, కొలిపాక నర్సింహ్మ, పాపయ్య పాల్గొన్నారు.


స్టేషన్‌ఘన్‌పూర్‌లో..

స్టేషన్‌ఘన్‌పూర్‌ టౌన్‌: కరోనా లాక్‌డౌన్‌ సమయానికి సంబంధించి రవాణా పన్ను రూ.267 కోట్లు రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించడం పట్ల స్టేషన్‌ఘన్‌పూర్‌ టాక్సీ డ్రైవర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం స్థానిక బస్టాండ్‌ వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య ఫ్లెక్సీలకు క్షీరా భిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాస్‌, నాయకులు సమ్మయ్య, ఎం.శ్రీనివాస్‌, కె.శివకుమార్‌, శంకర్‌, హరీష్‌, నర్సయ్య, చిరంజీవి, ప్రభాకర్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-25T08:26:06+05:30 IST