రక్తం గడ్డకట్టడం అంటే ఏమిటి? దీని వలన ప్రమాదంతో పాటు ప్రయోజనం కూడా ఉందని మీకు తెలుసా?

ABN , First Publish Date - 2021-12-12T16:13:55+05:30 IST

రక్తం గడ్డకట్టే సమస్య ఎవరికైనా..

రక్తం గడ్డకట్టడం అంటే ఏమిటి? దీని వలన ప్రమాదంతో పాటు ప్రయోజనం కూడా ఉందని మీకు తెలుసా?

రక్తం గడ్డకట్టే సమస్య ఎవరికైనా ఎదురవుతుంటుంది. రక్తం గడ్డకట్టడం అనేది సంభవించినప్పుడు రక్తం ద్రవం రూపం నుంచి జెల్‌గా మారడం ప్రారంభమవుతుంది, ఇది గడ్డకట్టే పరిస్థితికి దారితీస్తుంది. దీనిని థ్రాంబోసిస్ అని కూడా అంటారు. శరీరంలో ఎక్కడైనా గాయం, కోత ఏర్పడినప్పుడు రక్తం గడ్డకట్టడం అవసరమవుతుంది. ఈ ప్రక్రియ.. శరీరం నుండి రక్తం బయటకు రాకుండా నిరోధిస్తుంది. అయితే రక్తం గడ్డకట్టడమనేది శరీరం లోపలి సిరల్లో జరిగితే అది ప్రమాదకరంగా మారుతుంది. రక్తం గడ్డకట్టిన తరువాత అది సహజంగా కరిగిపోయి, తిరిగి రక్తంగా మారదు. రక్తం గడ్డకట్టడం అనే పరిస్థితి చాలా ప్రమాదకరమైనది. అది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తుంది. రక్తం గడ్డకట్టడం అనేది సిరలు లేదా ధమనులలో ఊహించని విధంగా సంభవించవచ్చు. ఇది రక్తనాళాల పని తీరును పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా శరీరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 


మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని స్ట్రోక్ అని అంటారు. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్రమైన తలనొప్పి వస్తుంది. రక్తం గడ్డకట్టడం వివిధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది గడ్డకట్టే ప్రదేశం, దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు శరీరంలో కనిపిస్తాయి. రక్తం గడ్డకట్టిన ప్రాంతంలో తిమ్మిరి, నొప్పి, వాపు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో రక్తం గడ్డకడితే.. ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి, పక్షవాతం తదితర లక్షణాలను చూపిస్తుంది. కాలులో రక్తం గడ్డకడితే అది కాలు వాపుకు కారణమవుతుంది. కరోనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టినట్లయితే గుండెపోటు సమస్య ఎదురవుతుంది. 

Updated Date - 2021-12-12T16:13:55+05:30 IST