Advertisement
Advertisement
Abn logo
Advertisement

Puneeth Rajkumar: ఈ కాలంలో అతి తక్కువ వయసులోనే చాలా మందికి గుండెపోటు.. డాక్టర్లు చెప్తున్న అసలు కారణాలివీ..!

ఇంటర్నెట్ డెస్క్: మొన్నటికి మొన్న ప్రముఖ నటుడు.. సిద్ధార్థ్ శుక్లా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తాజాగా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా కన్నుమూశారు. ఇద్దరూ 50ఏళ్ల లోపు వారే. కానీ వారి మరణానికి మాత్రం కారణం ఒక్కటే. అదే గుండె పోటు. గుండెపోటు వల్ల ఒకప్పుడు.. వయసులో పెద్ద వారు మాత్రమే చనిపోయేవారు. కానీ ఇప్పుడు దానికి వయసుతో సంబంధం లేదు. అలాగే స్త్రీ, పురుష భేదమూ లేదు. శారీరరక ధృడత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని హార్ట్ ఎటాక్.. అటాక్ చేస్తోంది. దీనికి సాక్ష్యం పునీత్ రాజ్ కుమారే. ఎన్ని వర్కౌట్‌లు చేసినా.. హార్ట్ ఎటాక్ నుంచి ఆయనను అవి కాపాడలేకోయాయి. నిజంగా వర్కౌట్‌లు మనిషిని హార్ట్ ఎటాక్ నుంచి కాపాడుతాయా.. ప్రస్తుతం అతి తక్కువ వయసులోనే హార్ట్ ఎటాక్ అటాక్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు అనే వివరాలు మీకోసం.. 


ప్రస్తుతం సమాజంలో వచ్చిన మార్పుల కారణాంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా చాలా మంది హార్ట్ ఎటాక్ బారినపడి చనిపోతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్ కుమార్‌ల మరణమే ఉదహరణ అని వారు పేర్కొంటున్నారు. సిద్ధార్థ్ శుక్లా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ.. ఎక్సర్‌సైజ్ తర్వాత అతడు ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిడి కారణంగానే హార్ట్ ఎటాక్ బారినపడ్డట్లు చెబుతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ విషయంలో కూడా ఒత్తిడే కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. వీరిద్దరి విషయంలో జరిగినట్టే.. చాలా మంది హార్ట్‌ ఎటాక్ బారినపడటానికి వారి ఎదుర్కొనే ఒత్తిడే ప్రధాన కారణం అయ్యిండొచ్చని చెబుతున్నారు. ఒత్తిడితోపాటు, జీవన శైలిలో వచ్చిన మార్పులు, స్మోకింగ్, మధ్యపానం, డ్రగ్స్, వ్యాయామం సమయంలో శరీరాన్ని ఎక్కువగా శ్రమపెట్టడం ద్వారా కూడా కొందరు కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్‌ల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని స్పష్టం చేస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్‌ రెండూ ఒకటే అని ప్రజలు భావిస్తున్నారని.. వాస్తవానికి అవి రెండు వేరు వేరని వైద్యులు చెబుతున్నారు. గుండె అకస్మాత్తుగా పని చేయకుండా ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని తెలుపుతున్నారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి, అక్కడే కుప్పకూలి స్పృహ తప్పుతాడని పేర్కొంటున్నారు. అదే.. గుండె‌కు అందే రక్త ప్రసరణలో ఆటంకాలు ఎదురైనప్పుడు వచ్చేది హార్ట్ ఎటాక్ అని పేర్కొంటున్నారు. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తుందని అంటున్నారు. కార్డియాక్ అరెస్ట్‌‌ సమయంలో.. చాతిలో నొప్పి, అసౌకర్యంగా అనిపించడం, విపరీతంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు అంటున్నారు. ఒత్తడి, మధుమేహం, రక్తపోటు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపతున్నవారు గుండెపోటు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలుపుతున్నారు. కార్డియాక్ అరెస్ట్‌ వల్ల స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తికి వెంటనే సీపీఆర్ అందించాలని వైద్యులు సూచిస్తారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తికి మాత్రమే సీపీఆర్ చేయాలని, హార్ట్ ఎటాక్‌ వచ్చిన వ్యక్తికి ఎట్టిపరిస్థితుల్లో సీపీఆర్ చేయవద్దని వెల్లడిస్తున్నారు. 


అంతేకాకుండా.. వ్యాయామాలు చేయడం ద్వారా ఫిట్‌గా ఉంటే.. వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని ప్రజలు నమ్ముతారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. కార్డియాక్ అరెస్ట్‌లను తప్పించడంలో వ్యాయామాలు, ఫిట్‌నెస్ వంటి విషయాలు అంతగా ప్రభావం చూపవని వైద్యులు చెబుతున్నారు. హార్ట్ ఎటాకే కాకుండా ఇతర ఏ రోగాల బారినపడకుండా ఉండేందుకు ప్రజలు.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వాటిని లైట్ తీసుకోవద్దని.. వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అథ్లెట్లు ప్రతి సంవత్సరం ఒత్తిడి, గుండె పనితీరు‌ను తెలుసుకునేందుకు అవసరమయ్యే పరీక్షలను చేయించుకోవాలని చెబుతున్నారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement