పుస్తకాలేవి సారు?

ABN , First Publish Date - 2022-09-19T06:02:59+05:30 IST

విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలైనా నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ పూర్తి స్థాయిలో అందలేదు. తెలుగు పుస్తకం ఉంటే గణితం లేదు, ఇంగ్లిష్‌ ఉంటే సామాన్యశాస్త్రం పుస్తకం లేదు. ఇలా విద్యార్థులకు ఏదో ఒక పుస్తకం కొరత ఉంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ మే నెలలోనే గోదాములకు రావాలి. విద్యాసంస్థలు ప్రారంభమవగానే వాటిని విద్యార్థులకు ఇవ్వాలి.

పుస్తకాలేవి సారు?

నేటికీ పూర్తిస్థాయిలో అందని పాఠ్యపుస్తకాలు

యూనిఫామ్‌ సైతం

పేదల చదువులపై ప్రభావం


భూదాన్‌పోచంపల్లి : విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలైనా నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ పూర్తి స్థాయిలో అందలేదు. తెలుగు పుస్తకం ఉంటే గణితం లేదు, ఇంగ్లిష్‌ ఉంటే సామాన్యశాస్త్రం పుస్తకం లేదు. ఇలా విద్యార్థులకు ఏదో ఒక పుస్తకం కొరత ఉంది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ మే నెలలోనే గోదాములకు రావాలి. విద్యాసంస్థలు ప్రారంభమవగానే వాటిని విద్యార్థులకు ఇవ్వాలి. అయితే ఇప్పటికీ పుస్తకాలు, యూనిఫామ్స్‌ ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడం నిరుపేద విద్యార్థులకు శాపంగా మారింది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాల ల్లో స్వీపర్‌ నుంచి మొదలు ఉపాధ్యాయుల వరకు పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేగాక మౌలిక వసతులు కరువై విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సైతం ఇదే పరిస్థితి ఉంది. 


ప్రభుత్వం నేటికీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయలేదు. గత ఏడాది పాఠ్యపుస్తకాలను సీనియర్‌ విద్యార్థుల నుంచి తెచ్చుకొని ముగ్గు రు విద్యార్థులకు ఒక పుస్తకంతో సరిపెట్టుకుంటున్నారు. అయితే పార్ట్‌-1, పార్ట్‌-2 విభాగాల్లో పార్ట్‌-1 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అయితే అవి కొన్ని పాఠశాలలకే పరిమితమయ్యాయి. కాగా, ఈ ఏడాది నుంచి ఒకటి నుం చి 8వ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టింది. ప్రైవేట్‌ పాశాలలకు విద్యార్థులు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించాలని ఇంగ్లీష్‌ మీడియంను అమలుచేస్తోంది. అయితే ఆలోచన బాగానే ఉన్నా పాఠ్యపుస్తకా లు సకాలంలో అందించలేకపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే ఇంగ్లీష్‌ మీడియం, ఉపాధ్యాయులు బోధించడం సైతం కొత్త. ఈ నేపథ్యంలో కనీసం హ్యాండ్‌ పుస్తకాలు కూడా లేవు. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమవ గా, ఈ నెల 15 వ తేదీ వరకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు. పలు పాఠశాలల్లో ఆరో తరగతి సాంఘికశాస్త్రం, ఏడో తరగతి సామాన్యశాస్త్రంతోపాటు భాషా సంబంధిత పుస్తకాలు పంపిణీ చేయలేదు. తెలుగు మీడియం పాఠశాలల్లో గత ఏడాది విద్యార్థుల వద్ద పాత పుస్తకాలు తీసుకొని నూతనంగా చేరిన విద్యార్థులకు అందించి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలోనే ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో పాత పుస్తకాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. భాషా పుస్తకాలు అందించినా కొంత మేరకు ప్రయోజనం ఉంటుంది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో

సూర్యాపేట జిల్లాలో 950 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటితోపాటు 18కస్తూర్బా, 9మోడల్‌ స్కూల్స్‌, 4గురుకుల పాఠశాలలు, 4మైనార్టీ పాఠశాలలున్నాయి. జిల్లాలో మొత్తం 61,445 మంది విద్యార్థులున్నారు. 5.50లక్షల పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అవసరం కాగా, ఇప్పటి వరకు 3.20లక్షలు మాత్రమే పంపిణీ చేశారు. ఇం కా 2.30లక్షల పుస్తకాలను అందించాల్సి ఉంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 16,540 పాఠశాలల్లో 1,55,000మంది విద్యార్థులున్నారు. వారికి 8,20,060 పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, 7లక్షల పుస్తకాలు పంపిణీ కాగా, లక్ష పుస్తకాలు స్టాక్‌ పా యింట్లలో నిల్వ ఉన్నాయి. జిల్లాలో మొత్తం 712 పాఠశాలల్లో 58వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి 4,75,940 పుస్తకాలు కావాల్సి ఉండగా, 4లక్షల పుస్తకాలు అందాయని, అందులో పార్ట్‌-1 పుస్తకాల పంపిణీ పూర్తయిందని, పార్ట్‌-2 పుస్తకాలు రాలేదని జిల్లా విద్యాధికారులు తెలిపారు.


ఏదో ఒక పుస్తకం కొరత

చాలా పాఠశాలల్లో రెండు, మూడు సబ్జెక్టు పుస్తకాలు రాలేదు. దీంతో ఎలా బోధించాలో ఉపాధ్యాయులకు కూడా అర్థం కావడం లేదు. ఒకటి నుంచి ఎనిమి దో తరగతి వరకు సైన్స్‌ పుస్తకం ఉంటే సోషల్‌ పుస్తకం లేదు. సోషల్‌ పుస్తకం ఉం టే సైన్స్‌ పుస్తకం లేదు. అదే విధంగా భాషా పుస్తకాల కొరత అధికంగా ఉంది. కరో నాతో కోలుకొని ఈ ఏడాదే పూర్తిస్థాయిలో విద్యాసంస్థలు నడుస్తుండగా పుస్తకాల కొరత తో విద్యార్థులు దారినపడేదెలా అని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


ఇంటర్‌ విద్యార్థులదీ అదే పరిస్థితి

ప్రైవేటు కాలేజీలకు వెళ్లే స్థోమత లేక ప్రభుత్వ కాలేజీలకు వెళ్తే ఇక్కడ పుస్తకాల్లేక దిక్కులు చూడాల్సి వస్తోందని ఇంటర్‌ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకులు బోధించిన నోట్‌ పుస్తకాలతోనే విద్యార్థులు నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఏటా ఉచితంగా అందజేస్తోంది. ఈ ఏడాది జూన్‌ 15 నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. గతడా ది మిగిలిన పుస్తకాలను అరకొరగా అందజేశారు. ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఒక్క పుస్తకమైనా ఇవ్వకుండానే తరగతులు ప్రారంభించా రు.నిబంధనల ప్రకారం పుస్తకాలు ప్రిం ట్‌చేసి సెలవుల్లోనే సరఫరా చేయాలి. ఈఏడాది కొత్తగా కేజీబీవీల్లో, ఎస్సీ, మైనార్టీ, సంక్షేమ, గురుకులాలను తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో బోధనకు అప్‌గ్రేడ్‌ చేశారు. వీరందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సిఉంది. కాగా, పుస్తకాలు అందక విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఫస్ట్‌ ఇయర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు సెకండ్‌ ఇయర్‌లో పుస్తకాల్లేకుండా మా ర్కులు తెచ్చుకోవడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అ‘డ్రెస్‌’ ఎక్కడ..?

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉచితంగా యూనిఫామ్స్‌ అందించాల్సి ఉన్నా, నేటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2,74,445 మంది విద్యార్థులు యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాల కోసం నిరీక్షిస్తున్నారు. విద్యాసంవత్సరం ఆరంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ యూనిఫామ్స్‌ అందలేదు. సర్కారు ముందస్తు ప్రణాళికను రూపొందించకపోవడంతో యూనిఫామ్స్‌ పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. యూనిఫామ్‌లు లేకపోవడంతో విద్యార్థులు సివిల్‌ డ్రెస్‌లతోనే పాఠశాలకు హాజరవుతున్నారు.


పుస్తకాలు లేక ఇబ్బందులు : విజయభాస్కర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌, పోచంపల్లి 

ఇంటర్‌ పాఠ్యపుస్తకాల కొరత ఉన్నది వాస్తవమే. ఇప్పటికే జిల్లాలో అవసరాన్ని బట్టి ఇండెంట్‌ పంపాం. పుస్తకాలు రాగానే విద్యార్థులకు అందజేస్తాం. అప్పటి వరకు ఫస్ట్‌ ఇయర్‌ వాళ్లకు పాత పుస్తకాలతో పాఠాలు బోధిస్తున్నాం. ద్వితీయ సంవత్స రం విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒక పుస్తకం ముగ్గురు కలిసి చదువుకుంటున్నారు.



మార్కులు తగ్గుతాయనే బెంగ ఉంది : కావేరి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

పాఠ్యపుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇంకా ప్రభుత్వం నుంచి అందజేయకపోవడంతో అధ్యాపకులు చెప్పిన నోట్‌ పుస్తకాలే చదువుతున్నాం. ప్రభుత్వం త్వరగా పుస్తకాలు అందజేస్తే బాగుంటుంది. నా ఫస్ట్‌ ఇయర్‌ పాఠ్యపుస్తకాలను జూనియర్ల కు ఇచ్చా. ఫస్ట్‌ ఇయర్‌లో మంచి మార్కులు వచ్చాయి. సెకండ్‌ ఇయర్‌లో ఎలా ఉంటుందోనని బెంగ ఉంది.


ప్రభుత్వం పుస్తకాలు అందించాలి : అక్షిత్‌, ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌

కళాశాలలు ప్రారంభించి నాలుగు నెలలైనా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అం దించలేదు. సార్లు చెప్పిన వాటిని నోట్‌బుక్‌లో రాసుకుని చదువుతున్నాం. విషయ వివర ణ అర్థం కావడం లేదు. చాలా ఇబ్బంది కలుగుతోంది. సీనియ ర్ల పుస్తకాలు తీసుకొని ముగ్గురు, నలుగురం కలిసి చదువుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పుస్తకాలు ఇవ్వాలి.


Updated Date - 2022-09-19T06:02:59+05:30 IST