లెక్కలు ఏవి ?

ABN , First Publish Date - 2021-02-25T05:35:58+05:30 IST

నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీచేసిప అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు ఆదాయ, వ్యయా లతో కూడిన లెక్కలను సమర్పించక పోవడాన్ని రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటున్నది

లెక్కలు ఏవి ?

  అభ్యర్థులపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌ 

 వివరణ కోరుతూ నోటీసులు 

 అనర్హత వేటు పడకుండా ప్రత్యామ్నాయమార్గాల కోసం అన్వేషణ 

 మున్సిపాలిటీల్లో కలకలం 


కరీంనగర్‌ టౌన్‌, ఫిబ్రవరి 24: నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పోటీచేసిప అభ్యర్థులు ఎన్నికల నిబంధనల మేరకు ఆదాయ, వ్యయా లతో కూడిన లెక్కలను సమర్పించక పోవడాన్ని రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటున్నది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో కొంతమంది, ఓటమి చెందిన వారిలో కొందరు నేటికీ లెక్కలు చూపిం చక పోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అలాంటి వారికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం మున్సి పాలిటీల్లో చర్చనీయాంశంగా మారింది.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కరీంనగర్‌, రామగుండం కార్పొరేషన్లు, హుజూరా బాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి, సిరిసిల్ల, వేముల వాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు ఉన్నా యి. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి దాదాపు 20 మంది వర కు గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు లెక్కలు సమర్పించలేదని తెలిసింది. వీరితో పాటు మరి కొంత మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా నిబంధనల మేరకు  లెక్కలు సమర్పించలేదని, వీరందరికీ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.


ఎన్నికల నియమావళి ప్రకారంగా లెక్కలు సమర్పించని గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా వేటు వేసే అవకాశం ఉంది. ఎన్నికల నియమావళి ప్రకా రం ఆదాయ, వ్యయాల వివరాలను సమర్పించలేదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కూడా ముగ్గురు కార్పొరేటర్లకు, కొంత మంది ఓడిపోయిన వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. నోటీసులను అందుకు న్న వారు అనర్హత వేటు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

Updated Date - 2021-02-25T05:35:58+05:30 IST