Abn logo
Nov 28 2020 @ 03:13AM

బీజేపీ మేనిఫెస్టోలో ‘గ్రేటర్‌’ అంశాలేవి?: తలసాని

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఇంత మంది కేంద్ర మంత్రులు వస్తారా? అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లేని అంశాలనూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మంత్రులకు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి ఏయే అంశా లు వస్తాయన్న కనీస పరిజ్ఞానం లేదని అన్నారు.


తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.25వేల వరదసాయం ఇస్తామంటున్న బీజేపీ నేతలు.. ఇందుకు జీవోను కేంద్ర ప్రభుత్వంతో ఇప్పిస్తారా? అని ప్రశ్నించారు.  మజ్లిస్‌ పార్టీ పరిధి చాలా చిన్నదని, ఆ పార్టీపై ఇంతగా మాట్లాడుతున్న బీజేపీ నేతలు పాతబస్తీలో ఎందుకు తిరగడం లేదన్నారు. 


Advertisement
Advertisement
Advertisement