ఇన్నాళ్ల పాలనలో ఏం చేశారు

ABN , First Publish Date - 2022-09-21T05:04:19+05:30 IST

ఇన్నాళ్లు పాలించిన నాయకులు పేద ప్రజల కోసం చేసిందేమీ లేదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

ఇన్నాళ్ల పాలనలో ఏం చేశారు
సీఎంఆర్‌ఎఫ్‌ చె క్కులు పంపిణీ చేస్తున్న మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

- కులమతాల మధ్య చిచ్చుపెడితే సహించం

- అర్ధరాత్రి ఆపద వచ్చినా అండగా నిలబడతా

- మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 20 : ఇన్నాళ్లు పాలించిన నాయకులు పేద ప్రజల కోసం చేసిందేమీ లేదని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి పాలకులు బాగు పడ్డారే తప్ప పేదప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబ ట్టారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రిల్లో చికిత్స చేయించుకున్న 23 మందికి మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.15.21 లక్షల చెక్కు లను బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా మంత్రి కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. డెబ్బై ఏళ్లు పరిపా లించి ప్రజల కోసం ఏం చేయని నాయకులు ఇప్పుడు మళ్లీ ఎన్నికలన గానే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారని విమర్శించారు. మేమొస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారని, ఎవరేంటో మీకే తెలుసని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. అర్ధరాత్రి ఆపదుందని ఫోన్‌చే స్తే అండగా నిలబడతానని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్‌ రహమాన్‌, నాయకులు తాటి గణేష్‌, కట్టా రవికిషన్‌రెడ్డి, ఖాజాపాషా, వినోద్‌ పాల్గొన్నారు. 

హన్వాడలో మరో బాలికల హాస్టల్‌

- మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హన్వాడ : హన్వాడ మండలానికి మరో బీసీ బాలికల హాస్టల్‌ను తీసు కువస్తానని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హన్వాడలో ఆసరా పింఛన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతి థిగా హాజరయ్యారు. స్థానిక మహాత్మాజ్యోతి బాపూలే గురుకులంలో చది వి జాతీయ స్థాయిలో ఇన్‌స్ఫైర్‌ పోటీలో ప్రతిభ చాటి, త్వరలో జపాన్‌ వెళ్లనున్న విద్యార్థిని తాటి భావనను మంత్రి సన్మానించారు. బాలికల విద్యాభివృద్ధికి హన్వాడలో మరో బీసీ బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయి స్తానని తెలిపారు. 200 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులు, ఆసరా పింఛన్‌ కార్డులు హన్వాడలో 175 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, వైస్‌ ఎంపీపీ లక్ష్మి, సర్పంచి రేవతి, ఎంపీటీసీ సత్యమ్మ, కల్పన, మాజీ జడ్పీటీసీ నరేందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, రైతు బంధు జిల్లా సభ్యులు రమణారెడ్డి, కొండ లక్ష్మయ్య, కొండ బాలయ్య, అన్వర్‌, మన్నన్‌, జంబులయ్య, అధికారులు, నాయకు లు, సర్పంచులు, ఎంపీటీసీలు ధనుంజయగౌడ్‌, రాజుయాదవ్‌, వెంకట య్య, కృష్ణయ్యగౌడ్‌, శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-21T05:04:19+05:30 IST