Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త, అత్తమామలను బాగా చూసుకునే భార్య.. అయితే రోజూ మధ్యాహ్నం కోడలు చేసే పని నచ్చక.. కుటుంబ సభ్యులు ఏంచేశారంటే..

అర్థం చేసుకునే భార్య రావడం చాలా కష్టం. ఇంట్లో పనులు చూసుకుంటూ, పని చేసి అలసిపోయి ఇంటికొచ్చిన భర్తకు సపర్యలు చేయడం, మరోవైపు అత్తమామల అవసరాలను తీర్చడం.. తదితర పనులన్నీ చక్కదిద్దే భార్య దొరికితే అంతకంటే అదృష్టం ఏముంటుంది. అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి ఇలాంటి లక్షణాలు గల మహిళనే వివాహం చేసుకున్నాడు. అయితే రోజూ మధ్యాహ్న సమయంలో ఆమె చేసే పని.. ఇంట్లోని వారికి నచ్చలేదు. దీంతో వారి కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయంటే..

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పరిధి మెహ్సానా జిల్లా కాదీకి చెందిన వ్యక్తితో ఓ మహిళలకు 2016లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఉద్యోగ నిమిత్తం అహ్మదాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సర్దుకుపోయే భార్య దొరకడంతో ఆ కుటుంబంలో మొదట్లో ఎలాంటి సమస్యలూ ఉండేవి కావు. ఆమె కూడా ఇంట్లో భర్త, అత్తమామలను బాగా చూసుకుంటూ మరోవైపు కూతురు బాగోగులు చూసుకుంటూ ఉండేది. మంచి భార్య దొరికిందని భర్త, సపర్యలు చేసే కోడలు దొరికిందని అత్తమామలు కూడా సంతోషించేవారు. అయితే పాప పుట్టిన కొన్నేళ్లకు ఈ సంతోషం వారిలో మాయమైంది. మనువడు పుట్టలేదనే బాధ మొదలైంది. దీంతో ఏదో ఒక సాకు చూపి కోడలిని వేధించడం మొదలెట్టేవారు.

ప్రతీకాత్మక చిత్రం

పొద్దున లేచినప్పటి నుంచి ఇంటి పనులన్నీ చూసుకునే ఆమె.. మధ్యాహ్న సమయంలో కాసేపు విశ్రాంతి తీసుకునేది. రోజూ ఇలా మధ్యాహ్న సమయంలో గంట సేపు నిద్రపోయేది. దీన్నే సాకుగా చూపి అత్తమామలు.. రోజూ వేధించేవారు. పని మీద శ్రద్ధ లేదంటూ బూతులు తిడుతూ, ఒక్కోసారి కొట్టడం వంటివి చేస్తుండేవారు. భర్త కూడా అత్తమామల మాటే వినడంతో వారి వేధింపులు రోజురోజుకూ ఎక్కువ అయ్యేవి. మగపిల్లాడిని కనలేదంటూ ఒకసారి, పనులు సరిగా చేయవంటూ మరోసారి.. ఇలా ఏదో ఒక సాకు చూపి చిత్రహింసలకు గురి చేసేవారు. కనీసం పాపను చూసే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు.

గతంలోనూ ఇలా వేధింపులు ఎక్కువవడంతో పోలీసులను ఆశ్రయించింది. తర్వాత కొన్నాళ్లు బాగానే చూసుకునే వారు. అయితే కొన్ని నెలలు గడవగానే మళ్లీ షరామామూలే అయింది. ఎన్ని రోజులు ఓపిక పట్టినా వారిలో మార్పు రాకపోవడంతో చివరికి పుట్టింటికి వెళ్లిపోయింది. కోడలిని ఎలాగైనా వదిలించుకుని.. కొడుక్కి వేరే పెళ్లి చేయాలని భావించారు. అమ్మగారింట్లో ఉన్నప్పటికీ ఫోన్లు చేసి వేధించేవారు. చివరకు తట్టుకోలేక.. బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement