డబుల్‌ ఇళ్లు ఏమయ్యాయి

ABN , First Publish Date - 2022-04-29T05:37:25+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1.40లక్షల ఇళ్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని, ప్రతీ ఒక్కరు ప్రశ్నిం చాలని బీజేపీ రాష్ట్ర అధక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

డబుల్‌ ఇళ్లు ఏమయ్యాయి
పగిడిమారిలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌

మక్తల్‌, ఏప్రిల్‌ 28: కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి 1.40లక్షల ఇళ్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని, ప్రతీ ఒక్కరు ప్రశ్నిం చాలని బీజేపీ రాష్ట్ర అధక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. ప్రజా సంగ్రా మ యాత్రలో భాగంగా గురువారం నారాయణపేట జిల్లా.. ఊట్కూర్‌ మండ లం పగిడిమారి వరకు పాదయాత్ర చేశారు. పగిడిమారిలో గుడిసెలో దుర్బర జీవితం గడుపుతున్న ఓబ్లాపూర్‌ నర్సమ్మ, భీంరావ్‌ ఇళ్లను పరిశీలించారు. దళి త బస్తీల్లో ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు కట్టుకుంటే డబ్బులు ఇస్తామంటే అప్పులు చేసి కట్టుకున్నామని, ఇంత వరకు బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గ్రామ సమస్య లను బండి సంజయ్‌కి వివరించారు. మా గ్రామం నుంచి మిషన్‌భగీరథ పైపులైన్‌ వెళుతుందని, తాగేందుకు నీరు లేక ఉప్పునీరు తాగి బతుకుతున్నా మన్నారు. ఇళ్లులేని చాలా మందికి డబుల్‌బెడ్‌రూం మంజూరు కాలేదన్నారు. స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదన్నారు. గ్రామంలో ఒక్కరికి కూడా దళితబంధు పథకం రాలేదని వాపోయారు.  మురుగుకాల్వలు లేవని, సీసీ రోడ్లు, పెన్షన్ల సమస్యలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ మాజీ సభ్యులు విఠల్‌, పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షులు గీతమూర్తి, మాదిరెడ్డి జలంధర్‌రెడ్డి, కొండ య్య, అశోక్‌లు పాల్గొన్నారు. 

సమతామూర్తి విగ్రహావిష్కరణకు మొహం చాటేసిన కేసీఆర్‌

హైదరాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ గ్రామం లో సమతామూర్తి విగ్రహా విష్కరణకు ప్రధాని మోదీ రావడం వల్లనే సీఎం కేసీఆర్‌ మొహం చాటేశారని బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ అన్నారు. మక్తల్‌ ని యోజకవర్గంలోని ఊట్కూర్‌ మండలం పగిడిమారి గ్రా మంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు. కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ ఎన్‌డీటీవీకి ఇ చ్చిన ఇంటర్య్వూలో సమతామూర్తి విగ్రహావిష్కరణకోసం పీఎం వో నుంచి ఫోన్‌ చేసి కేసీఆర్‌ను రావొద్దని చెప్పారనడం పచ్చి అబద్దం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్‌, కేసీఆర్‌ పచ్చి అ బద్దాలు, మోసపూరిత మాటలతో పాలన సాగిస్తున్నా రన్నారు. సమ తామూర్తి విగ్రహావిష్కరణకు అనారోగ్య కారణాల వల్లనే సీఎం రాలే దని మంత్రులు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమ తామూర్తి విగ్రహావిష్కరణ ముగిసి నెలలు గడచినా ఇప్పటి వరకు నోరు మెదపని కేసీఆర్‌, కేటీఆర్‌లు ఇప్పుడు మాట్లాడటం నీచమైన రాజకీయాల కు పరాకాష్ట అని అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌(భారత రాష్ట్ర సమతి) చేస్తామని కేసీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భారతదేశం మొత్తం కాకుంటే ప్రపంచమంతా టీఆర్‌ఎస్‌ను విస్తరింపజేసుకోవాల న్నారు. ప్రజాసంగ్రామయాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్‌ఎస్‌ నేతల్లో గుబులు పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 



Updated Date - 2022-04-29T05:37:25+05:30 IST